Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ తో అఫైర్‌ పై కుండబద్దలు..!

By:  Tupaki Desk   |   16 Oct 2018 4:53 AM GMT
హీరోయిన్‌ తో అఫైర్‌ పై కుండబద్దలు..!
X
బాలీవుడ్‌ లో లవ్‌ అఫైర్స్‌ అనేవి చాలా కామన్‌ గా చూస్తూనే ఉంటాం. తాజాగా బాలీవుడ్‌ లో ఎక్కువగా వినిపిస్తున్న ప్రేమ కథ పర్హాన్‌ అక్తర్‌ మరియు హీరోయిన్‌ శిబానీ దండేకర్‌ లదని చెప్పుకోవచ్చు. గత కొన్నాళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, వీరిద్దరు చట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు వాటిపై మాత్రం వారిద్దరు క్లారిటీ ఇవ్వలేదు. పైగా మీడియాకు దొరకకుండా జాగ్రత్త పడుతూ, రహస్య ప్రేమాయణం సాగిస్తున్నారు. ఇలాంటి వీరు ఎట్టకేలకు ఓపెన్‌ అప్‌ అయ్యారు. తమ మద్య ప్రేమ గురించి ఫుల్‌ క్లారిటీ ఇచ్చాడు.

నటుడు పర్హాన్‌ అక్తర్‌ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించాడు. తాజాగా శిబానీ దండేకర్‌ తో కలిసి ఉన్న ఒక ఫొటోను తన ఇన్‌ స్టాగ్రాం పేజ్‌ లో పోస్ట్‌ చేశాడు. దాంతో పాటు హార్ట్‌ సింబల్‌ ను కూడా పోస్ట్‌ చేయడంతో ఇద్దరం ప్రేమలో ఉన్నట్లుగా చెప్పకనే చెప్పాడు. వీరిద్దరు త్వరలోనే వివాహం కూడా చేసుకునేందుకు సిద్దమవుతున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో చర్చజరుగుతుంది. గత కొన్నేళ్లుగా చెట్టా పట్టాలేసుకుని రహస్యంగా తిరిగిన వీరిద్దరు ఇకపై అధికారికంగా, ఓపెన్‌ గానే తిరగబోతున్నారన్నమాట.

పర్హాన్‌ 2000వ సంవత్సరంలో తనకంటే వయస్సులో పెద్ద అయిన అధునా భభానీని వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కూడా 2016వ సంవత్సరంలో విడిపోయారు. అప్పటి నుండి కూడా హీరోయిన్‌ శిబానీ దండేకర్‌ తో ప్రేమాయణంను సాగిస్తున్నాడు. మోడల్‌ గా, యాంకర్‌ గా పలు రంగాల్లో సత్తా చాటి ప్రస్తుతం హీరోయిన్‌ గా సెటిల్‌ అయిన శిబానీ దండేకర్‌ 38 ఏళ్ల వయస్సు వచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. 44 ఏళ్ల పర్హాన్‌ అక్తర్‌ కు శిబానీ దండేకర్‌ కు మంచి జోడని, వీరిద్దరు పెళ్లి చేసుకుంటే జీవితం హాయిగా సాగుతుందని బాలీవుడ్‌ వర్గాల వారు చెబుతున్నారు.