హీరో హాట్ ఎఫైర్.. ఇంత పబ్లిగ్గానా?

Tue Feb 19 2019 11:44:12 GMT+0530 (IST)

గత కొంతకాలంగా నటి సింగర్ శిబాని దండేకర్ తో ఎఫైర్ సాగిస్తూ నటుడు దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ వేడి పెంచుతున్న సంగతి తెలిసిందే. సింగిల్ స్టాటస్ అన్నదే తనకు నచ్చదని గురుడు నిరూపిస్తున్నాడు. సరిగ్గా ఏడాది క్రితం ఈ ఇద్దరూ ఓపెన్ అయ్యారు. తమ బాంధవ్యానికి సంబంధించిన ఫోటో క్లూ ఇచ్చారు. ఇప్పటికి ఆ బంధం మరింత ధృడపడింది. గత కొంతకాలంగా ఫర్హాన్ శిబానీ హాట్ రొమాంటిక్ లైఫ్ ని పబ్లిక్ ప్లాట్ ఫామ్ పైకి బహిర్గతం చేస్తుండడంతో ఆ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో యూత్ జోరుగా వైరల్ చేస్తున్నారు.బెడ్ రూమ్ రొమాన్స్.. బీచ్ సైడ్ రొమాన్స్.. జిమ్ లో రొమాన్స్ .. ఇలా ప్రతిదీ ఫోటోల రూపంలో బయటికి వచ్చేస్తున్నాయి. అయితే సదరు హాట్ హీరో హీటెక్కించే రొమాన్స్ ఇలా పబ్లిక్ అయిపోవడం చూస్తుంటే మరీ ఇంత ఓవరాక్షన్ అవసరమా? అంటూ కామెంట్లు పడిపోతున్నాయ్. తాజాగా ఆ ఇద్దరూ బికినీ బీచ్ లో సెలబ్రేషన్స్ చేస్తున్న ఫోటోల్ని అభిమానులకు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ఘాటైన ప్రేమ ఘటన.. మరీ ఇంత మోటుగా ఉందే! అంటూ మాట్లాడుకుంటున్నారంతా. గత ఏడాది క్రిస్మస్ వేడుకలు మొదలు కొత్త సంవత్సరం వేడుకల్ని ఈ జంట స్నేహితులతో కలిసి గ్రాండ్ గా జరుపుకున్నారు. తాజాగా బీచ్ రిసార్ట్ సెలబ్రేషన్స్ లో మునిగి తేల్తున్నారు.

రెండేళ్ల క్రితం కుర్ర బ్యూటీ శ్రద్ధా కపూర్ తో ఘాటైన ప్రేమాయణం సాగించిన ఫర్హాన్ అప్పట్లో తనతో సహజీవనం చేస్తున్నాడని వార్తలొచ్చాయి. ఆ తర్వాత శిబానీ అతడి లైఫ్ లో ప్రవేశించడంతో ఆ ఇద్దరి మధ్యా బ్రేకప్ అయ్యిందని వార్తలొచ్చాయి. ఇక శిబానీ ఇప్పటికే తన బోయ్ ఫ్రెండ్ నుంచి విడిపోయి ఫర్హాన్ తో చెలిమి చేయడం హాట్ టాపిక్.