Begin typing your search above and press return to search.

ఆ హీరో అందుకు సిగ్గు పడ్డం లేదట

By:  Tupaki Desk   |   28 May 2016 5:31 AM GMT
ఆ హీరో అందుకు సిగ్గు పడ్డం లేదట
X
ఆన్ లైన్ లో ట్రాలింగ్ ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. సెలబ్రిటీలు ఏదైనా పాయింట్ లో దొరకడం ఆలస్యం.. నెటిజన్లు ట్రాల్ చేసేస్తున్నారు. ఇందుకోసం తమ ట్యాలెంట్ అంతా ఉపయోగించేస్తున్నారు. రీసెంట్ గా బ్రహ్మోత్సవం విషయంలో ట్రాలింగ్ ఏ రేంజ్ లో జరిగిందో చూశాం. ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా ట్రాలింగ్ పెరిగిపోతోంది. బాలీవుడ్ ఫర్దీన్ ఖాన్ దీనిపై గట్టిగానే రియాక్ట్ అవాల్సి వచ్చింది.

గతంలో తన పర్ఫెక్ట్ ఫిట్ బాడీతో ఆకట్టుకున్న ఫర్దీన్ ఖాన్.. కొన్నేళ్లుగా సినిమాలు చేయడం లేదు. దీంతో ఇప్పుడు బాగా లావైపోయాడు. గతంలో ఉన్న సైజుకు డబుల్ అయిపోయి.. లడ్డూబాబు రేంజ్ లోకి మారిపోయాడు. దీంతో ఫర్దీన్ బాడీపై ట్రాలింగ్ ఎక్కువైపోయింది. దీనికి బాగా ఫీలైన సింగర్ అద్నాన్ సమీ.. ఎవరినీ వారి బాడీ సైజుతో కొలవకూడదని, ట్యాలెంట్-మెంటాలిటీల గురించే ఆలోచించాలని క్లాస్ పీకాడు. ఇతను కూడా ఒకప్పుడు భారీకాయుడే అయినా తర్వాత తగ్గిన విషయం తెలిసిందే.

తనపై వస్తున్న ట్రాల్స్ కు ఫర్దీన్ ఖాన్ ఓ పెద్ద ఓపెన్ లెటర్ రాశాడు. 'నేను లావయిపోవడంతో నాపై చేస్తున్న ట్రాలింగ్ కు నేనేం బాధ పడ్డం లేదు, సిగ్గు పడ్డం లేదు. డిప్రెషన్ కి గురి కాలేదు. ఇంకా చెప్పాలంటే నేను వాటిని ఎంజాయ్ చేస్తున్నా. వీకెండ్ లో మంచి కామెడీ అందిస్తున్నారు. వీలైతే మీ ట్యాలెంట్ ఇంకా చూపించి నన్ను నవ్వించండి అలరించండి' అంటూ రాసుకొచ్చాడు ఫర్దీన్ ఖాన్. ట్రాలింగ్ పై ఈ టైపులో రియాక్ట్ అయింది మాత్రం ఫర్దీన్ ఖాన్ మాత్రమే అని చెప్పచ్చు.