Begin typing your search above and press return to search.

అఖిల్ తో హోలాండ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   17 July 2018 5:34 AM GMT
అఖిల్ తో హోలాండ్ బ్యూటీ
X
మొదటి రెండు సినిమాల ఫలితం తేడా కొట్టినా కొత్త ఎనర్జీతో హీరో అఖిల్ తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. లవ్ స్టోరీ జానర్ లో రూపొందుతున్న ఈ మూవీకి మిస్టర్ మజ్ను టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక తాజాగా అప్ డేట్ ప్రకారం ఇందులో అఖిల్ తో కలిసి కాలు కదిపేందుకు హోలాండ్ బ్యూటీ ఫరా కరిమేను తీసుకొస్తున్నట్టు తెలిసింది. ఈ బ్యూటీ ఎవరా అంటే వెంటనే ఫ్లాష్ కాకపోవచ్చు కానీ ధృవ మూవీలో విలన్ అరవింద్ స్వామి గర్ల్ ఫ్రెండ్ గా గౌతమి పుత్ర శాతకర్ణిలో గ్రీకు రాణిగా కనిపించింది ఈ తెల్ల తోలు భామే. తన కాన్సెప్ట్ కి ఫరా అయితేనే సరిగ్గా సరిపోతుంది అని భావించిన వెంకీ అట్లూరి అఖిల్ తో కూడా గ్రీన్ సిగ్నల్ తీసేసుకున్నాడట. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ భారీ నిర్మాత బివిఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. దీపావళి లేదా ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

అఖిల్ లాంటి యూత్ స్టార్ పక్కన ఛాన్స్ అంటే ఫరాకు మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. భారతీయ మూలాలున్న ముస్లిం కుటుంబంలో పుట్టిన ఫరా బాల్యం మొదలుకుని డిగ్రీ దాకా మొత్తం డచ్ లోనే చేసింది. ముంబైకి షిఫ్ట్ అయ్యాక మోడలింగ్ వైపు వెళ్లి యాడ్స్ చేస్తున్న క్రమంలో తేరా సరూర్ సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయమయింది. కమర్షియల్ గా ఆ సినిమా సక్సెస్ అయినా తనకు అవకాశాలు మాత్రం రాలేదు. విదేశీ ఛాయలు మొహంలో స్పష్టంగా ఉండటం వల్ల రెగ్యులర్ హీరోయిన్ ఆఫర్స్ దక్కడం లేదు. మూడేళ్ళ నుంచి సినిమా ఛాన్సుల కోసం పోరాడుతున్న ఫరా మోడల్ గా మాత్రం నెంబర్ వన్. టిబిజెడ్-లాక్మే-ఎన్వీ లాంటి ఎన్నో జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్ ప్రమోటర్ గా నటించింది. ఇప్పుడు అఖిల్ సినిమా కనక మంచి గుర్తింపు వస్తే తెలుగులో మరికొన్ని అవకాశాలు కొట్టేయవచ్చు అనే ఆశతో ఉందీ భామ .