Begin typing your search above and press return to search.

ఇండియా కథలు ఎప్పుడు డార్లింగ్ ?

By:  Tupaki Desk   |   18 May 2019 5:51 AM GMT
ఇండియా కథలు ఎప్పుడు డార్లింగ్ ?
X
బాహుబలి 2 వచ్చి అటుఇటుగా రెండేళ్ళు అవుతోంది. సాహో కోసం ఆగస్ట్ 15 ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ తేదీని ఖచ్చితంగా నమ్మడానికి లేదు. యూనిట్ స్వయంగా ఏదైనా టీజరో లేదా పోస్టరో అధికారికంగా విడుదల చేసి ప్రకటిస్తే అప్పుడు నిశ్చింతగా ఉండొచ్చు. మరోవైపు జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తీస్తున్న సినిమా షూటింగ్ కూడా సాహోతో సమాంతరంగా తీస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ లో ఇటలీని తలపించేలా సుమారు 30 కోట్ల బడ్జెట్ తో 8 సెట్లు వేశారన్న మాట ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రభాస్ కథల ఎంపికను గమనిస్తే ఓ అనుమానం రాకమానదు

సాహోలో అధిక శాతం స్టోరీ దుబాయ్ తదితర దేశాల్లో సాగుతుంది. పాన్ ఇండియా మూవీ కాబట్టే దానికి తగ్గట్టే కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ పొందుపరిచారు. మరోవైపు రాధాకృష్ణ తీస్తున్న సినిమా పిరియాడిక్ లవ్ స్టొరీ. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఇక్కడ గమనిస్తే రెండు సినిమాల అధిక పోర్షన్ విదేశాల్లోనే సాగుతుంది. ఇండియాకు లింక్ ఉండొచ్చు కాని మెయిన్ పాయింట్ మాత్రం ఫారినే. ఇవి సరే కాని ఇకపై కూడా ప్రభాస్ ఇలా ఇతర దేశాల బ్యాక్ డ్రాప్ లోని కథలు ఎంచుకుంటాడా లేక మన దేశం వైపు ఓ లుక్ వేస్తాడా అనే క్వశ్చన్ మార్క్ మొదలైంది

ప్రభాస్ కెరీర్ బెస్ట్ గా చెప్పుకునే వర్షం-చత్రపతి-ఈశ్వర్- మిర్చి- బాహుబలి రెండు భాగాలూ అన్ని కూడా ఇండియా బ్యాక్ డ్రాప్ లో రూపొందినవే. కథకు ఎక్కడా ఫారిన్ కంట్రీస్ తో లింక్ ఉండదు. అలాంటి వాటిలో మరోసారి తమ హీరోని చూడాలని ఫాన్స్ కోరిక. ఇక్కడేమో ప్రభాస్ ని దర్శకులు ఇటలీ దుబాయ్ అంటూ తిప్పుతున్నారు. వీటి తర్వాత చేసేదైనా మన నేల మీద ఉంటుందేమో చూద్దాం