ట్రెండీ టాక్: ఖాన్ దాదా పాక్ ఫేవరిజం?!

Tue Feb 19 2019 12:47:07 GMT+0530 (IST)

కింగ్ ఖాన్ షారూక్ పాకిస్తాన్ ఫేవరిజం అంటూ దుష్ప్రచారం సాగుతోందా? ఇది పెను వివాదానికి తావిస్తోందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. పుల్వామా దాడుల నేపథ్యంలో మరోసారి ఖాన్ దాదా మతం గురించి.. అతడి ఇనిషియేషన్ గురించి ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. షారూక్ పై ఈ తరహా దాడులు ఇప్పుడే కొత్త కాదు. అతడికి మతపరమైన వేధింపులు.. ఇంటా బయటా తప్పలేదు. విమానాశ్రయాల్లో భద్రత పేరుతో అవమానించిన సందర్భం ఉంది. అయితే తాజాగా పుల్వామా దాడి - సైనికుల మృతి అనంతరం షారూక్ పై ఓ దారుణమైన అభియోగం మోపి - అతడిని సామాజిక మాధ్యమాల్లో తిట్టేయడం ప్రధానంగా చర్చకు వచ్చింది.ఇంతకీ షారూక్ చేసిన అపరాధం ఏంటి? అంటే.. ఇటీవలే పాకిస్తాన్ గ్యాస్ ఫైర్ బాధితులకు రూ.45కోట్లు ఇచ్చాడంటూ బాద్ షాని నెటిజనులు తిట్టేస్తున్నారు. వరుసగా గ్యాప్ లేకుండా ట్రోల్స్ వైరల్ అవుతుండడంతో ఈ సన్నివేశం నుంచి ఖాన్ కి అనవసర ఇబ్బంది కలగకుండా అభిమానులు జాగ్రత్త పడడం చర్చకొచ్చింది. షారూక్ పై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అభిమానులు ఖండిస్తున్నారు.

``స్టాప్ ఫేక్ న్యూస్ ఎగైనిస్ట్ ఎస్ ఆర్ కే`` అంటూ ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు. ఆ పేరుతో సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. పుల్వామా ఎటాక్స్ బాధితులకు బాలీవుడ్ స్టార్లంతా సాయం చేస్తుంటే.. కింగ్ ఖాన్ షారూక్ అందుకు విరుద్ధంగా పాక్ కి సాయం చేశారనడంలో ఎలాంటి నిజం లేదని అభిమానులు స్పష్టత నిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు భారతదేశం విషయంలో షారూక్ ధృక్పథాన్ని గుర్తు చేస్తూ అతడు 12 గ్రామాల్ని దత్తత తీసుకుని ప్రజలకు సాయం చేసిన శ్రీమంతుడు అని అభిమానులు ప్రశంసలు కురిపించారు. అతడిపై తప్పుడు ప్రచారం తగదని ఖండించారు. ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఈ వార్త వేడెక్కిస్తోంది. 2010లో `మై నేమ్ ఈజ్ ఖాన్` రిలీజ్ సమయంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ కింగ్ ఖాన్ ని ఆద్యంతం సోదాలు చేసి అతడిని గంటల కొద్దీ వెయిట్ చేయించి అవమానించడంపై ఆసక్తికర చర్చ సాగింది. అమెరికా న్యూయార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేకించి ముస్లిమ్ లను తనిఖీలు చేసిన అధికారులు షారూక్ ని తీవ్రంగా అవమానించడంపై ఆసక్తికర చర్చ సాగింది.