వీడియో: ఎన్టీఆర్ ఇంటిముందు ఫ్యాన్స్ హంగామా

Tue May 21 2019 10:26:51 GMT+0530 (IST)

నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెల్సిందే. పుట్టిన రోజు సందర్బంగా ఎన్టీఆర్ కు సినీ ప్రముఖులు మరియు స్నేహితుల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందాయి. ఇక అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హ్యాపీబర్త్ డే ఎన్టీఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో హల్ చల్ చేశారు. సోషల్ మీడియాలోనే కాకుండా అభిమానులు ఎన్టీఆర్ ఇంటికి కూడా వెళ్లారు. ఎన్టీఆర్ ఇంటి ముందు ఉదయం నుండే పెద్ద ఎత్తున అభిమానులు గుమ్మి గూడారు. వారిని కంట్రోల్ చేసేందుకు ఎన్టీఆర్ ఇంటి వద్ద సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్న వారికి తల ప్రాణం తోకు వచ్చిందట.అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో వారికి ఒక సారి కనిపించేందుకు ఎన్టీఆర్ బాల్కనీలోకి వచ్చాడు. కొద్ది సేపు ఉండి అభిమానులకు అభివాదం చేసి అందరికి కనిపించి అక్కడ నుండి లోనికి వెళ్లి పోయాడు. ఎన్టీఆర్ వెళ్లి పోయిన తర్వాత కూడా అభిమానులు ఎన్టీఆర్... ఎన్టీఆర్... సీఎం ఎన్టీఆర్... అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ ను చూసిన కొద్ది సేపటి తర్వాత అభిమానులు అక్కడ నుండి వెళ్లి పోయారు.

అభిమానులకు కనిపించడానికి వచ్చిన సమయంలో కూడా ఎన్టీఆర్ చేతికి కట్టు ఉంది. దాంతో ఎన్టీఆర్ చేతి గాయం నుండి కోలుకున్నట్లుగా లేడు. ఆర్ ఆర్ ఆర్ కొత్త షెడ్యూల్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇంకా కూడా చేతికి ఎన్టీఆర్ కట్టుతోనే ఉండటంతో ఫ్యాన్స్ కాస్త టెన్షన్ లో ఉన్నారు. గాయం నుండి కోలుకున్న వెంటనే రాజమౌళి దర్శకత్వంలోని ఆర్ ఆర్ ఆర్ చిత్రం షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు.