Begin typing your search above and press return to search.

అరవ పైత్యం మనోళ్లకూ బాగానే పట్టింది

By:  Tupaki Desk   |   15 Jan 2018 10:41 AM GMT
అరవ పైత్యం మనోళ్లకూ బాగానే పట్టింది
X
థియేటర్ బయట కటౌట్‌కు పాలాభిషేకాలు చేయడాలు.. తెర మీద హీరో కనిపిస్తుంటే హారతులు పట్టడాలు.. ఇలాంటి వీరాభిమానం ముందుగా మొదలైంది తమిళనాడులోనే. తర్వాత అది తెలుగు నాటకు కూడా పాకింది. ఇక గత కొన్నేళ్లలో హీరోలపై తమిళ అభిమానుల ఆరాధన పతాక స్థాయికి చేరింది. హీరోల ఫస్ట్ లుక్స్ లాంటివేమైనా రిలీజైనపుడు.. కంప్యూటర్ల ముందు కూర్చుని వాళ్లు చేసే హడావుడి మామూలుగా ఉండదు. అలాగే తమ హీరోల సినిమాలు టీవీల్లో వచ్చినపుడు వెర్రి అభిమానం చూపిస్తుంటారు. థియేటర్లో మాదిరే ఇక్కడా హీరో కనిపించినపుడు హారతులు పట్టడం లాంటివి చేస్తుంటారు.

ఇలాంటి విషయాల్లో మన ఫ్యాన్స్ కూడా వాళ్లను చూసి ఇన్‌స్పైర్ అవుతున్నట్లున్నారు. తాజాగా ఈ ఆదివారం ఓ తెలుగు ఛానెల్లో మహేష్ బాబు సినిమా ‘స్పైడర్’ను ప్రిమియర్ షోగా వేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ చూసి మురిసిపోతూ కొందరు వీరాభిమానం ప్రదర్శించారు. హారతులు పట్టారు. గొప్ప ఘనకార్యమేదో చేసినట్లు దానికి సంబంధించిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇలాంటివి చూసి జనాలు నవ్వుకుంటారు లేదంటే ఈ స్థాయి వ్యక్తి పూజా అంటూ చీప్‌గా చూస్తారు తప్ప ఎవ్వరూ అభినందించరు. హీరోల్ని అభిమానించడం తప్పు కాదు కానీ.. ఇది అభిమానం కాదు, వెర్రి. ఇలాంటివి ఎవరికీ గొప్పగా అనిపించవు. కాబట్టి మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మిగతా అభిమానులూ ఇలాంటి వాటికి దూరంగా ఉంటే బెటర్.