Begin typing your search above and press return to search.

కామెంట్‌: ఫ్యామిలీని రింగులోకి లాగేయాల‌ని

By:  Tupaki Desk   |   28 Nov 2015 10:30 PM GMT
కామెంట్‌: ఫ్యామిలీని రింగులోకి లాగేయాల‌ని
X
మా సినిమా ఫ్యామిలీ సినిమా. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా. స‌కుటంబ స‌ప‌రివారంగా విచ్చేసి విజ‌య‌వంతం చేయండ‌హో! అంటూ అప్ప‌ట్లో డ‌ప్పేసేవారు. ఊరూరా మైక్ వేసుకుని రిక్షా ఒక‌టి వీధుల‌న్నీ క‌లియ‌తిరిగేది. కానీ ఇప్పుడ‌లా డ‌ప్పు వేయ‌డం కంటే నేరుగా కంటెంట్‌లోకే ఫ్యామిలీని జొప్పించేస్తే పోలా ? అని అనుకుంటున్నారు మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. వీళ్లు తానా అంటే తందానా అంటున్నారు హీరోలు కూడా. అందుకే ఇటీవ‌లి కాలంలో అన్నీ ఫ్యామిలీ స్టోరీలే తెర‌కెక్కుతున్నాయి. ఎన్నారై సొంత విలేజీకి వ‌చ్చినా - అత్త‌తో - అత్త కూతుళ్ల‌తో పెట్టుకున్నా.. ఇందుకు ఇటీవ‌లి కాలంలో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ కొత్త దారి చూపించాడు. అత్త - అత్త కూతుళ్ల‌తో స‌ర‌స‌మాడే బావ‌గా ఆక‌ట్టుకున్నాడు అత్తారింటికి దారేది చిత్రంతో ఎన్నారై ఫ్యామిలీ క‌థ‌ల‌కు కొత్త ఊపు వ‌చ్చింది.

ఆ త‌ర్వాత రిలీజైన పండ‌గ చేస్కో లాంటి సినిమాకి సేమ్ క‌థ‌నే రిపిటీ్ చేశారు. ఇటీవ‌లి కాలంలో విజ‌య‌వంత‌మై టాలీవుడ్ రికార్డుల్ని తిర‌గ‌రాసిన శ్రీ‌మంతుడు మూవీలోనూ సేమ్ కంటెంట్‌. సొంత ఊరుని బాగుచేసే శ్రీ‌మంతుడుగా మ‌హేష్ న‌టించాడు. అయితే అంత‌కంటే ముందే సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు వంటి ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమాతో బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నారు ప్రిన్స్‌ - వెంక‌టేష్‌. ప్ర‌స్తుతం బ్ర‌హ్మోత్స‌వం సినిమాలో మ‌హేష్ ఫ్యామిలీ స‌మేతంగా క‌నిపిస్తాడు. ఇక మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం కూడా ఫ్యామిలీ కంటెంట్‌తోనే తెర‌కెక్కుతోంది. నాన్న‌కు ప్రేమ‌తో అంటూ టైటిల్ లోనే ఫ్యామిలీని సెట‌ప్ చేశాడు సుకుమార్‌. నాన్న కోసం కొడుకు ప‌డే త‌ప‌న ఇది అని ముందే చెప్పేశాడు. అంటే ఫ్యామిలీ డ్రామాలో ఎన్టీఆర్ మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. నాన్న‌కోసం ఎలాంటి యాక్ష‌న్ చేశాడ‌న్న‌ది కూడా తెర‌పై ఇంట్రెస్టింగ్గా చూపిస్తాడ‌న‌డంలో సందేహ‌మేం లేదు. నితిన్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న అ..ఆ కూడా ప్యామిలీ డ్రామానే. కాస్త రొమాన్స్ అద‌నంగా జోడించాడంతే.

నాగార్జున హీరోగా సోగ్గాడే చిన్ని నాయ‌నా ఫ్యామిలీ డ్రామాతో తెర‌కెక్కిస్తున్న సినిమానే . తండ్రిగా, కొడుకుగా రెండు పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు కింగ్‌. ఇదంతా ఓ విలేజీ బ్యాక్‌ గ్రౌండ్‌ లో చ‌క్క‌ని ఫ్యామిలీ డ్రామాతో తెర‌కెక్కుతోంది. అల్ల‌రోడు - మోహ‌న్‌ బాబుతో క‌లిసి మామ మంచు-అల్లుడు కంచు అనే ఇంట్రెస్టింగ్ సినిమాలో న‌టిస్తున్నాడు. మంచు - కంచు ఫ్యామిలీ సెట‌ప్ ఉన్న క్యారెక్ట‌ర్లే. అలాగే మ‌నోజ్ న‌టిస్తున్నశౌర్య ఓ చ‌క్క‌ని ఫ్యామిలీ డ్రామా.. అనే చెప్పొచ్చు. ఇలా ఫ్యామిలీ చుట్టూ ఫ్యామిలీ స‌న్నివేశాల‌తో, ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ తో మునుముందు బోలెడ‌న్ని సినిమాలొస్తున్నాయి.