ఫైనల్ గా సమంత పేరెంట్స్ ఇలా

Thu Oct 12 2017 23:26:19 GMT+0530 (IST)

ఫైనల్ గా టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ లవర్స్ పెళ్లి ఊహించిన దానికంటే ఎక్కువ సంబరాలతోనే జరిగింది.  సినీ ఫీల్డ్ లో ఏ స్టార్స్ చేసుకొని విధంగా హిందు - క్రిస్టియన్ పద్ధతుల్లో పెళ్లి చేసుకొని ఎంతో అర్థవంతమైన భార్య భర్తలుగా నలుగురికి ఆదర్శంగా నిలిచారు. అయితే మొదటి నుంచి వీరి పెళ్లి కి సంబంధించిన ఎదో ఒక ఫొటో రోజుకోకటి బయటపడుతూనే వచ్చింది.ముఖ్యంగా సమంత పెళ్లి ఉదయం అనగా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫొటోస్ ని పోస్ట్ చేస్తూనే వచ్చింది. ఇక నాగార్జున కూడా కొడుకు పెళ్లి లో  ప్రతి మూమెంట్ ని అభిమానులతో పంచుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఫొటోలు వచ్చినా సమంత ఫ్యామిలి మెంబర్స్ మాత్రం కనిపించలేదు. ముఖ్యంగా సమంత పేరెంట్స్ షేర్ చేసిన ఒక్క ఫొటోస్ లో కూడా కనిపించలేదు. పెళ్లి హడావుడి లో ఎన్నో మర్చిపోతారు అనుకోని ఎవరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. అంతే కాకుండా ఆడపిల్ల తరపున వారు అన్ని పనులు చూసుకోవాలి కదా అందులో బిజీ అయ్యి ఉంటారేమో అని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినబడ్డాయి కానీ ఫైనల్ గా వారి ఫోటో సోషల్ మీడియాలో వచ్చింది.

పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఇరు కుటుంబాలు హ్యాపీగా ఒక ఫొటోకు స్టీల్ ఇచ్చారు. ఆ ఫొటోలో సమంత అమ్మ నాన్న తో పాటు అమల - నాగ్ అండ్ అఖిల్ ఫైనల్ ఫొటోకి స్మైల్ ఇచ్చారు. సమంత తండ్రి ప్రభు తెలుగువారే కానీ మథర్ నిన్నెట్టే మలయాళీ. సమంత 1987 లో జన్మించింది. ఆమె బాల్యం మొత్తం చెన్నై లోనే సాగింది. సమంత ప్రొఫైల్ ని చూస్తుంటే సౌత్ బాషాలని బాగానే కవర్ చేసినట్లుంది కదా..