ఎన్టీఆర్ కు ఏం కాలేదు!!

Tue Mar 13 2018 16:35:00 GMT+0530 (IST)

ఎక్కడ నుంచి పోగేసి రాస్తారో ఈ గాలి వార్తలు కానీ వీటితో సెలెబ్రిటీలకు పెద్ద తలనొప్పే అయిపోతోంది. ఇక వారి కుటుంబసభ్యులకు మరింతగా టెన్షన్ పెరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ గాయపడ్డాడంటూ యూట్యూబ్  ఛానెల్స్ కొన్ని పోస్టులు పెట్టాయి. అది నిజమేనేమోనని అభిమానులు తెగ కలవరపడ్డారు. అది ఉత్త బోగస్ న్యూస్ అని తేలిపోయిందిప్పుడు.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ - చెర్రీ కాంబినేషన్‌లో ఓ మూవీ ప్రారంభమవ్వబోతోంది. ఇందులో భాగంగా టీమ్ అంతా కలిసి లాస్ ఏంజలస్ వెళ్లారు. అక్కడ ఓ స్టూడియో టెస్ట్ షూట్ జరిగింది. కాగా ఆ టెస్ట్ షూట్ లో ఎన్టీఆర్ గాయపడ్డాడని యూట్యూబ్ లో వార్తలు కనిపించాయి. అసలేం జరిగిందో మాత్రం తెలియదు. దీంతో అభిమానులంతా ఇది నిజమేనా అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీనికి ఎన్టీఆర్ పీఆర్ మహేష్ కోనేరు స్పందించారు. అదంగా ఉత్తిదేనని... ఎన్టీఆర్ కు ఏం కాలేదని చెప్పారు. అతను లాస్ ఏంజలస్ నుంచి హైదరాబాద్లోని తన ఇంటికి చేరుకున్నాడని చెప్పాడు. జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నాడని తెలిపాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమాలో రెడీ అవుతున్నాడు. ఆ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో చేసే మల్టీస్టారర్ సినిమా మొదలవుతుంది. తన అన్న కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే ఆడియో వేడుక త్వరలో జరగనుంది. ఆ వేడుకకు ఎన్టీఆర్ హాజరుకానున్నాడని సమాచారం. ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమాను కళ్యాణ్ రామే ప్రొడ్యూస్ చేశాడు.