Begin typing your search above and press return to search.

కొందరు నిర్మాతల వెనక అసలు నిజాలు

By:  Tupaki Desk   |   7 Feb 2016 5:30 PM GMT
కొందరు నిర్మాతల వెనక అసలు నిజాలు
X
కొత్త నిర్మాతలు అయినా సరే కొందరు భారీగా పెట్టుబడులు పెట్టేస్తుంటారు. గట్టి దెబ్బలే తగిలినా.. మళ్లీ పెద్ద స్టార్టతో సినిమాలు చేసేందుకు సిద్ధమయిపోతుంటారు. ఇవాల్టి ట్రెండ్ లో ఒక్కో సినిమాకి కనీసం 40 కోట్ల రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేసేస్తూండడం, లాస్ లు వచ్చిన వెంటనే ప్రాజెక్టులు అనౌన్స్ చేసేస్తుండడం వెనక పెద్ద కథే ఉంది.

నిజానికి తెరమీద నిర్మాత అంటూ కొందరి పేర్లు పడుతూ ఉంటాయి కానీ.. అసలు పెట్టుబడిదారులు వేరే ఉంటారు. కొందరు ఎన్నారైలు తమ పేర్లు బయటకు రాకుండా ఇన్వెస్ట్ మెంట్లు చేస్తూ ఉంటారు. బ్లాక్ మనీని వైట్ గా మార్చుకునే ఐడియాలు కూడా ఇందులో ఉంటాయి. అయితే డబ్బు సంపాదించుకోవాలనే కోరిక, సినిమా రంగంపైనా, పరిచయాలపైనా ఉన్న ఇంట్రెస్ట్ కూడా కారణమే. ముఖ్యంగా అమెరికాలో ఉండే కొందరు బిజినెస్ మాగ్నెట్స్.. భారీ సినిమాల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇక్కడ ఉంటూ ఇన్వెస్ట్ చేసే స్లీపింగ్ పార్ట్ నర్స్ కూడా కోకొల్లలు.

అందుకే ఒకట్రెండు సినిమాలతో వంద కోట్లకు దెబ్బ పడిపోయినా.. వెంటనే మరో సినిమా మొదలుపెట్టే వీలు కలుగుతుంది. సాధారణంగా ఈ నష్టం పూడ్చుకోవడానికి పదేళ్లు పట్టినా ఆశ్చర్యం ఉండదు. ఇప్పుడర్ధమైందా కొందరు కొత్త ప్రొడ్యూసర్ల వరుస భారీ సినిమాల నిర్మాణం వెనుక అసలు కథేంటో.