Begin typing your search above and press return to search.

F2 డే-1 కలెక్షన్స్ ఇవే

By:  Tupaki Desk   |   13 Jan 2019 5:33 AM GMT
F2 డే-1 కలెక్షన్స్ ఇవే
X
సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ - మెగా హీరో వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ 'F2'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. పండగ సీజన్లో ప్రేక్షకులు ఆశించే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో కలెక్షన్స్ కూడా బాగున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 4.95 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. ఈ ఓపెనింగ్ కలెక్షన్స్ వరుణ్ తేజ్ కెరీర్లో ది బెస్ట్. ఇది వరకూ వరుణ్ తేజ్ కెరీర్లో 'ఫిదా' ఓపెనింగ్ డే కలెక్షన్స్ 3.43 కోట్లు హయ్యెస్ట్. ఇక వెంకీ కెరీర్లో ఈ కలెక్షన్స్ సెకండ్ హయ్యెస్ట్. రూ.5.56 కోట్లతో 'బాబు బంగారం' మొదటి స్థానంలో ఉంది. సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో 'F2' కే మౌత్ టాక్ బాగుంది. ఈ రోజునుండి శెలవులు మొదలయ్యాయి కాబట్టి కలెక్షన్స్ మరింతగా మెరుగయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను రూ. 34.50 కోట్లకు అమ్మిన సంగతి తెలిసిందే.

తెలుగు రాష్ట్రాలలో F2 మొదటి రోజు ఏరియా వైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి

నైజాం: 1.72 cr
సీడెడ్: 0.53 cr
ఉత్తరాంధ్ర: 0.56 cr
ఈస్ట్: 0.62 cr
వెస్ట్: 0.58 cr
కృష్ణ: 0.41 cr
గుంటూరు: 0.38 cr
నెల్లూరు: 0.18 cr

టోటల్: రూ. 4.98 cr షేర్(ఏపీ +తెలంగాణా)

Disclaimer: Data Gathered from Various Confidential Sources And May Also Include estimates. Use And Follow at your Own Discretion. We Don't Guarantee Any Authenticity Of the Same.