Begin typing your search above and press return to search.

చరిత్రలో నిలిచే సినిమా తీస్తాడా త్రివిక్రమ్?

By:  Tupaki Desk   |   3 Aug 2015 4:13 PM GMT
చరిత్రలో నిలిచే సినిమా తీస్తాడా త్రివిక్రమ్?
X
త్రివిక్రమ్ - నితిన్ కాంబినేషన్ త్వరలో పట్టాలెక్కబోతోంది. స్క్రిప్ట్‌కి ఫినిషింగ్ టచ్ ఇఛ్చిన మాటల మాంత్రికుడు... సెప్టెంబర్ లో ఈ సినిమాను సెట్స్ పైకి వెళ్లనుంది. ఫిబ్రవరి కల్లా షూటింగ్ ఫినిష్ చేసి ఏఫ్రిల్ నాటికి రిలీజ్ చేయాలన్నది త్రివిక్రమ్ ఆలోచన. మొదటి మూవీ తప్ప ఇప్పటివరకూ అన్నీ స్టార్స్ తోనే తీసిన త్రివిక్రమ్.... ఏళ్ల తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతోంది ?

త్రివిక్రమ్ అంటే జీనియస్ కి మరోపేరు అన్నంత ఖ్యాతి ఉంది. ప్రతిభావంతుల జాబితాలో ఆయన పేరు ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. అయినా సరే... ఈయన తీసేవన్నీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలే. పదునైన పంచ్ లతోపాటు.. ఇఫ్పుడు బూతు జోకులు కూడా వేసేస్తున్నాడీయన. తన స్థాయికి తగ్గ సినిమాలు త్రివిక్రమ్ తీయడం లేదనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నా... కమర్షియల్ హిట్ కోసమే ప్రయత్నించడం ఆలోచించదగ్గ విషయం.

బాలీవుడ్ లో అయితే రెగ్యులర్ ఫార్మాట్లతోపాటు... భజరంగీ, లంచ్ బాక్స్, పీకు వంటి విభిన్నమైన కథాంశాలతోనూ సినిమాలు తీస్తారు ప్రతిభ గల డైరెక్టర్లు. వీటిని కమర్షియల్ హిట్ చేసుకుని... సత్తా ప్రదర్శిస్తారు నిర్మాతలు. తెలుగులో ఈ వాతావరణం కనిపించడం లేదు. కనీసం త్రివిక్రమ్ లాంటి మేథావి అయినా... ఈ దిశగా ప్రయత్నిస్తే బాగుంటుంది. గతేడాది ఈయన రూపొందించిన సత్యమూర్తి లో... అంత స్టాండర్డ్ కనిపించదు. అయినా... రూ.50కోట్లు వచ్చేశాయి. ఇప్పుడు ఎలాగూ లో బడ్జెట్ సినిమా తీస్తున్నాడు కాబట్టి... ఓ ప్రయోగం చేసి.. తెలుగు సినిమా చరిత్రలో తన పేరు లిఖించుకోదగ్గ కళాఖండం తీస్తాడని ఆశిద్దాం.