Begin typing your search above and press return to search.

'అవతార్‌' రికార్డు బ్రేక్‌ అయ్యేనా?

By:  Tupaki Desk   |   22 April 2019 10:06 AM GMT
అవతార్‌ రికార్డు బ్రేక్‌ అయ్యేనా?
X
హాలీవుడ్‌ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లను దక్కించుకున్న హాలీవుడ్‌ చిత్రంగా 'అవతార్‌' ఉంది. 2.7 బిలియన్‌ డాలర్లు ఇండియన్‌ కరెన్సీలో చూస్తే దాదాపుగా 19 వేల కోట్లు. అవతార్‌ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ నెంబర్‌ వద్దకు వెళ్లే స్థాయి సినిమాలు మాత్రం రాలేదు. అయితే ఈనెల 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న 'అవెంజర్స్‌ : ఎండ్‌ గేమ్‌' చిత్రం మాత్రం అవతార్‌ ను బీట్‌ చేయడం ఖాయం అంటున్నారు. అవెంజర్స్‌ సిరీస్‌ లో రాబోతున్న ఎండ్‌ గేమ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.

ఒక్క ఇండియాలోనే ఈ చిత్రం కనీసం 500 కోట్ల వసూళ్లను సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. హిందీతో పాటు పలు సౌత్‌ భాషల్లో కూడా విడుదల కాబోతున్న ఎండ్‌ గేమ్‌ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 20 వేల కోట్లను వసూళ్లు చేయడం ఖాయం అంటూ ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అవెంజర్స్‌ గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రం డబుల్‌ యాక్షన్‌ తో పాటు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ ఇస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

మరో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ చిత్రంకు ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్‌ బుకింగ్‌ మొదలు అయ్యింది. అడ్వాన్స్‌ బుకింగ్‌ మొదలు అయ్యిందో లేదో అప్పుడే వారంకు పైగా టికెట్టు బుక్‌ అయ్యాయి. అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారానే వేల కోట్ల రూపాయలు వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇండియాలో ఈ చిత్రంకు పెద్ద ఎత్తున ప్రమోషన్‌ చేస్తున్నారు. అమీర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌ చిత్రాల స్థాయిలో ఈ చిత్రంను ప్రమోట్‌ చేస్తున్నారు. సౌత్‌ లో కూడా ఈ చిత్రంను భారీ ఎత్తున ప్రమోట్‌ చేస్తున్నారు. ఎండ్‌ గేమ్‌ సందడి చూస్తుంటే 3 బిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయడం పెద్ద కష్టం ఏమీ కాదనిపిస్తుంది. మరో నాలుగు రోజుల్లో రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి సరికొత్త సంచలనాలను నమోదు చేస్తుందో చూడాలి.