ఫోటో స్టొరీ: సో బ్యూటిఫుల్.. సో సెన్సువల్

Sat Jun 15 2019 12:30:24 GMT+0530 (IST)

ఎందరో మహానుభావులు టైపులో ఎందరో అందాల భామలు.. అందరికీ లక్షల కొద్దీ లైకులు. అసలు ఈ అందాలు లేకపోతే  ప్రస్తుతం  ప్రపంచంలో ఉండే నెగెటివిటికి జనాలు ఒక్కొక్కరు  ఈపాటికే ఒక్కో గోలమ్ పాత్రలా మారిపోయి 'మై ప్రెషియస్..మై ప్రెషియస్' అంటూ ఉండేవారు.  'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' సినిమా చూడని వాళ్ళు అదేంటని ఫీల్ కావాల్సిన పని లేదు.  గోలమ్/స్మీగల్ తెలియకపోతే నష్టమేమీ లేదు. ఇప్పుడు టాపిక్ ఆ పాత్రగురించి కాదు.. ఆ పాత్రను బ్యాక్ ఎండ్ లో పోషించిన ఆండీ సెర్కిస్ గురించి కాదు.. ఎవెలిన్ శర్మ గురించి.బాలీవుడ్ భామ అయిన ఎవెలిన్ ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ భామ ఇండియన్ కాదు. జర్మన్ సిటిజన్ షిప్ ఉన్న భామ.  నాన్న ఇండియన్.. అమ్మ జర్మనీ మహిళ.  ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్'..  'నౌటంకీ సాలా'.. 'ఏ జవాని హై దీవాని'.. 'హిందీ మీడియం' లాంటి సినిమాల్లో నటించింది.  ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో ను పోస్ట్ చేసి 'సాటర్ డే ఫీల్స్' అనే క్యాప్షన్ ఇచ్చింది.  వీకెండ్ ప్రారంభం అయింది కదా.. అందుకే ఫుల్ జోష్ లో ఉన్నట్టుంది.

ఫోటో లో ఒక నిచ్చెనకు ఆనుకొని ఎంతో న్యాచురల్ గా పోజిచ్చింది. అందాల ప్రదర్శన లేదు కానీ అందాల బొమ్మలా ఉంది.  వెనక ఉన్న కొబ్బరి చెట్టు.. ఆ ఆకుల కలర్ లో ఎవెలిన్ డ్రెస్ కలర్ కూడా కలిసిపోయింది. లూజ్ హెయిర్.. ఆ జుట్టును సవరించుకుంటున్నట్టుగా ఒక చేతిని పైన పెట్టింది.  పెద్ద బెల్ట్ ఎవెలిన్ డ్రెస్ కు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది.   బ్రౌన్ కలర్ లిప్ స్టిక్.. ఎవెలిన్ ఫేస్ లో ఆ ఎక్స్ ప్రెషన్ చూస్తే ఎవరైనా అమ్మడి మాయలో పడిపోయి.. ఆ అందాలకు సాహో అనాల్సిందే. 

ఈ ఫోటో కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటారు.. నిన్ను చూసిన తర్వాత నిజం అనిపిస్తోంది".. "సో బ్యూటిఫుల్.. సో సెన్సువల్".. "చాంద్ సా రోషన్ చెహెరా.. గాలోంకా రంగ్ సునెహరా".. "ఫెంటాస్టికల్లీ ఫ్యాబులస్.. అమేజింగ్లీ బ్యూటిఫుల్" అంటూ కామెంట్లు పెట్టారు.