ఫోటో స్టొరీ: ఈతకొలనుకు.. అందాలకు సాహో !

Sun May 19 2019 22:29:32 GMT+0530 (IST)

ఎవెలిన్ శర్మ తెలుసు కదా?  మీకు తెలియక పోయినా త్వరలో తెలిసిపోతుంది. కారణం ఏంటంటే ఈ భామ ప్రభాస్ 'సాహో' లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది.  ఎవెలిన్ బాలీవుడ్ భామ.  అయితే బాలీవుడ్ బ్యూటీ అనగానే ఏ నార్త్ ఇండియన్ బ్యూటీనో అనుకుంటాం.  కానీ ఈ బ్యూటీ జర్మన్ బేబీ.  నాన్న ఇండియన్.. అమ్మ జర్మనీ మహిళ.   ఇంగ్లీష్ మూవీ 'టర్న్ లెఫ్ట్' తో నటిగా కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ 'ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్'..  'నౌటంకీ సాలా'.. 'ఏ జవాని హై దీవాని'.. 'హిందీ మీడియం'.. 'జబ్ హ్యారీ మెట్ సెజల్' లాంటి సినిమాల్లో నటించింది.ఇదంతా నటిగా ఈ బ్యూటీ బయోడేటా.  అయితే పాప హాట్ నెస్ బయోడేటాను గురించి చెప్పాలంటే అందరి వల్లా కాదు. దానికి కూడా బీకాం ఫిజిక్స్ లాగా జఫ్ఫా యూనివర్సిటీ ఆఫ్ హాట్ సైన్సెస్ లో బికినీయిజం లో పీహెచ్ డీ చేసి ఉండాలి.  లేకపోతే మాటల రాక.. కీబోర్డు లోని ఎస్ డీ ఎఫ్ :ఎల్ కే జీ ల పై వేళ్ళు కదలక ఎంతో వేదన అనుభవించాల్సి వస్తుంది.  ఈ భామ తాజాగా.. అంటే 24  గంటల క్రితం తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "ఈ సమ్మర్ హీట్ రిడిక్యులస్ గా ఉంది #కూల్ డౌన్ #ముంబై వెదర్ # పూల్ టైమ్".   అంటే ముంబై హీటుకు పిచ్చెక్కి రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది.

ఇంతకీ ఫోటోను కళ్ళారా దర్శించుకున్నారు కదా?  సంతోషం.  ఇప్పుడర్థం అయింది కదా వీటి గురించి రాయాలంటే  జఫ్ఫా యూనివర్సిటీలో డిగ్రీ ఎందుకు అవసరమో.  అయితే కామెంట్స్ పెట్టేందుకు మాత్రం అదేమీ అవసరం లేదు. అందుకే ఎవెలిన్ ముంబైలో హీట్ వేవ్ కు షాక్ తిన్నట్టుగా.. వారి వారి ఊర్లలో ఎండకు బ్రెయిన్ అటూ ఇటూ ఊగుతున్న నెటిజనులను ఈ హాటు షో మళ్ళీ ఈ లోకానికి తీసుకొచ్చింది.  ఒక నెటిజనుడు"నువ్వు నా మనసుని గాయపరుస్తున్నావు"అన్నాడు.  అంటే బాడీని ఎండ రఫ్ఫాడిస్తుంటే మనసు బాక్సును ఎవెలిన్ బద్దలు చేస్తోందన్నమాట. మరో నెటిజనుడు "నువ్వు పరిస్థితిని ఇంకా దిగజారుస్తున్నావు డియర్" అన్నాడు. మరొకరు "ఆగ్ లగా దీ" అన్నాడు.  ఈ బ్యూటీ హాట్ షో ముందు సమ్మర్ జుజుబీ అనిపిస్తోంది కదా?