Begin typing your search above and press return to search.

సాహోలో ఛాన్స్.. ఎక్సయిట్ అవుతోంది

By:  Tupaki Desk   |   25 April 2018 6:55 AM GMT
సాహోలో ఛాన్స్.. ఎక్సయిట్ అవుతోంది
X
ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహోపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. అందుకు తగినట్లుగానే క్యాస్టింగ్ కూడా పెంచుకుంటూ పోతున్నారు. కొత్త కొత్త యాక్టర్లను జత చేసుకుంటూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు సాహోలోకి జర్మన్ మోడల్ కం బాలీవుడ్ యాక్టర్ వచ్చి చేరింది.

ఫ్రం సిడ్నీ విత్ లవ్ అనే చిత్రంతో అరంగేట్రం చేసిన ఎవ్లిన్ శర్మ.. ఇప్పుడు సాహో మూవీలో కీలక పాత్రకు ఎంపిక అయింది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాలో తనకు అవకాశం వచ్చిన సంగతి ఎవ్లిన్ చెప్పేసింది. 'సాహో మూవీలో ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు సుజిత్ నన్ను అప్రోచ్ అయిన మాట వాస్తవమే. అఫ్ కోర్స్.. నేను వెంటనే ఒప్పుకున్నాను కూడా. ఇప్పటివరకూ నేను చేసిన రోల్స్ తో పోల్చితే.. ఇది చాలా విభిన్నమైన క్యారెక్టర్ అవుతుంది. నా ట్యాలెంట్ ను చూపించడానికి ఇదో అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాను' అంటోంది ఎవ్లిన్ శర్మ.

దక్షిణాదిలో తనకు ఇంతకంటే గ్రాండ్ లాంఛ్ లభించే అవకాశం లేదంటూ.. సాహో చిత్రంపై తన ఒపీనియన్ చెప్పింది ఎవ్లిన్ శర్మ. సాహో మూవీలో ఎవ్లిన్ శర్మ కొన్ని స్టంట్స్ కూడా చేయనుందట. వీటిని తన అభిమానులు విపరీతంగా ఎంజాయ్ చేస్తారని.. ఇందుకోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకోబోతున్నానని చెబుతోంది ఎవ్లిన్ శర్మ.