Begin typing your search above and press return to search.

చైతూ-శ్రుతి.. మనసు దోచారు

By:  Tupaki Desk   |   29 Aug 2016 8:22 AM GMT
చైతూ-శ్రుతి.. మనసు దోచారు
X
ఆల్రెడీ ఎవరే ఎవరే.. అనే శ్రావ్యమైన పాటతో వీనుల విందు చేసింది ‘ప్రేమమ్’ టీమ్. ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన వీడియో కూడా వచ్చేసింది. వినడానికి ఎంత హాయిగా ఉందో.. చూసేందుకు కూడా అంతే ఆహ్లాదంగా అనిపిస్తోందా పాట. చందూ మొండేటి చక్కటి విజువల్స్‌ తో మెస్మరైజ్ చేశాడు.

మలయాళ వెర్షన్ కు హైలైట్ గా నిలిచిన మలార్ పాత్రలో శ్రుతి హాసన్ ఎలా ఉంటుందో.. సాయిపల్లవిని శ్రుతి రీప్లేస్ చేయగలదా అని సందేహించిన వాళ్లు ఈ వీడియో సాంగ్ చూశాక అభిప్రాయాలు మార్చుకుంటారేమో. శ్రుతి అంత బాగా ఒదిగిపోయింది ఆ పాత్రలో. చైతూ కూడా చక్కటి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు.

మలయాళ వెర్షన్ తో పోలిస్తే ఇందులో విజువల్స్ కొంచెం గ్రాండ్ గా ఉన్నాయి కూడా. ‘‘అందరు అందమైన అమ్మాయిలూ సినిమాల్లోకే వెళ్లరు. కొందరు టీచింగ్ లోకి కూడా వస్తారు’’ అనే కొటేషన్ ను చైతూ.. శ్రుతికి చూపించే షాట్ ఈ పాటకు హైలైట్ అని చెప్పాలి. చైతూ-శ్రుతిల కెమిస్ట్రీ ఈ పాటలో చక్కగా కుదిరింది. సినిమాకు కూడా అదే బలంగా నిలిచేలా కనిపిస్తోంది. మొత్తానికి ‘ప్రేమమ్’ మీద ఇప్పటికే ఉన్న అంచనాలు.. ఈ పాట తర్వాత మరింత పెరుగుతాయనడంలో సందేహం లేదు.