Begin typing your search above and press return to search.

అ!.. కలల ప్రపంచంలో తెలుగు పోరి

By:  Tupaki Desk   |   12 Dec 2017 5:29 AM GMT
అ!.. కలల ప్రపంచంలో తెలుగు పోరి
X
నాని సపోర్ట్ తో వస్తోన్న అ! సినిమా ఎలా ఉంటుందో గాని అంచనాలు మాత్రం బాగానే రేపుతోంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తోన్న ఫస్ట్ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే నిత్యా మీనన్ - శ్రీనివాస్ అవసరాల ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేసిన చిత్ర బృందం రీసెంట్ గా మరో హీరోయిన్.. తెలుగు పోరి ఈషా రెబ్బా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. సినిమాలో అమ్మడి పాత్ర చాలా వినూత్నంగా ఉండనుందట.

ఈషా ముక్కుపోగుతో అందంగా కనిపిస్తోంది. అలాగే అందమైన కలల ప్రపంచం అనే ఫీలింగ్ ని ఆ పోస్టర్ గుర్తు చేస్తోంది. ఓ వైపు ఓ పాప తో తండ్రి వెళుతుండడం మరోవైపు రెండు పావురాలు అలాగే ఒక గుడి ఆ పోస్టర్ లో ఉన్నాయి. చూస్తుంటే ఈషా పాత్ర ప్రేమ భక్తి ఆప్యాయత చుట్టూ తీరుగుతుందేమో అనిపిస్తోంది. చిత్ర యూనిట్ ప్రతి పాత్రకు సంబంధించి ఎదో ఒక విషయాన్ని పోస్టర్ ద్వారా చెప్పకనే చెబుతోంది, వెండితెరపై ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదని నాని ఇంతకుముందే చెప్పాడు.

ఇక సినిమాలో నిత్యా మీనన్.. కాజల్.. రెజీనా.. అలాగే మరికొంత మంది పాపులర్ నటులు నటిస్తోన్న సంగతి తెలిసిందే. సినిమాలో నాని ఒక చేపకు వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు. ఇక రవితేజ కూడా ఒక మొక్కకు తన వాయిస్ ని అందించాడు. దాదాపు 90% వరకు సినిమా అయిపోవచ్చిందని సమాచారం నెక్స్ట్ ఇయర్ మొదట్లోనే కూల్ గా సినిమాను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాల్ పోస్టర్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.