Begin typing your search above and press return to search.

అతడి ఒడిలో ఎందుకు బైఠాయించిందో

By:  Tupaki Desk   |   21 March 2017 2:17 PM GMT
అతడి ఒడిలో ఎందుకు బైఠాయించిందో
X
ఇండియన్ హాట్ బ్యూటీ అనేందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది ఈషా గుప్తా. ఈ భామ కెరీర్ లో మంచి హిట్ సినిమాలే ఉండడంతో ఆఫర్ల వరకూ ఏ మాత్రం కొదువ లేదు. అయితే.. సినిమాల కంటే.. వాటిలో చూపించే యాక్టింగ్ ట్యాలెంట్ కంటే కూడా తన హాట్ నెస్ తోనే ఎక్కువ రచ్చ చేస్తూ ఉంటుంది ఈషా.

లేటెస్ట్ ఫ్యాషన్ ని ఈ రేంజ్ లో ఉన్న భామలు ఫాలో అవడంలో పెద్ద విశేషమేమీ ఉండదు. ఇదుగో ఇలా రగ్గడ్ జీన్స్ లో హంగామా చేస్తూ దిగిన ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా షేర్ అవుతోంది. ఇందులో ఈషా డ్రెసింగ్ కంటే.. ఆమె ఓ యంగ్ స్టర్ ఒడిలో కూర్చుని అంత క్లోజ్ గా ఫోటోకు పోజ్ ఇవ్వడమే అసలు కారణం. ఇంతకీ ఇతడి పేరేంటంటే.. పరిక్షిత్ వద్వానీ. ఇతనికి సినిమాలతో ఉన్న సంబంధం ఏంటంటే.. సెలబ్రిటీలకు అండార్స్ మెంట్స్ చేయించడమే. ఈ పరిక్షిత్ తో ఈషా గుప్తాకు ఉన్న లింక్ ఏంటనే విషయంపై మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ లేదు.

తరచుగా ఇతడితో దిగిన ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈషా. ఓ సారి హత్తుకుంటూ.. మరోసారి ముద్దెట్టుకుంటూ.. ఇప్పుడు ఒడిలో వాలిపోయి మరీ ఫోటోలు తీయించేసుకుందంటే.. వీరిద్దరి మధ్య వ్యవహారం చాలా డీప్ గా ఉందనే అంటున్నారు బాలీవుడ్ జనాలు. మరి ఇది సుదీర్ఘ కాలం సాగేదా లేక కొన్నాళ్లకు ముగిసిపోయే కనెక్షనా అన్న విషయమే ఇంకా తేలాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/