ఫోటో స్టోరి: సిల్క్ డ్రెస్ లో హాటీ

Sun Jun 18 2017 15:31:07 GMT+0530 (IST)

ఈషా గుప్తా పేరు ఇప్పుడు ఇప్పుడే  బాలీవుడ్ లో వినిపిస్తుంది. మాజీ మిస్ ఇండియా అయిన ఇషా కొన్ని సినిమాలు చేసినా ఆమెను ఒక లీడ్ హీరోయిన్గా ఇంకా బాలీవుడ్ గుర్తించనేలేదు. తను నటించిన రుస్తోమ్ సినిమాతో మంచి గుర్తింపే తెచ్చుకుంది. ఇప్పుడే అలాగే తన హాట్ ఫిగర్ తో అందరిని అలరించడానికి అజయ్ దేవగన్ తో కలిసి వస్తుంది. 'బాద్షాహో' సినిమా పోస్టర్ నిన్ననే విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అమ్మడు తన వాడి వేడి అంతా ఒక్కచోట పెట్టినట్లు కనిపిస్తుంది.

పోస్టర్ పక్కన పెట్టండి ఇక్కడ అద్దం ముందు మేకప్ వేసుకొన్న తన అందం చూడండి హాట్ అంటే ఏంటో అర్ధమవుతుంది అన్నట్లు ఫోజులిచ్చింది. పొద్దునే జాబిలి ఎక్కడికో బయలుదేరుతు బ్లాక్ సిల్క్ గౌన్ వేసుకొని హాఫ్ కర్ల్స్ హెయిర్ స్టైల్ తో తన అందంతో ప్రపంచాన్ని పలకరించింది. ఇలా పెట్టిన పోస్ట్ దానికి తగ్గ కేప్షన్ ‘ముందు మనం ఫోజ్ ఇచ్చుకుందాం’ అని పెట్టి వదిలింది. ఎదురుగా ఉన్న అద్దం అదిరేలా ఉన్న ఈ సిల్క్ డ్రస్సు లుక్కులో అమ్మడు కస్సుమంటోంది కదూ. కుర్రాళ్ళకు ఈ మేకప్ రూమ్ ఫోటోలు చాలనుకుంటా.. తమ కలల ప్రపంచంలో తేలిపోవడానికి.

ఇకపోతే ఈషా గుప్తా బాద్షాహో పోస్టర్ కు కూడా మంచి స్పందన వచ్చింది ఇప్పుడు ఇషా గుప్తా అదరగొట్టింది. ఇదే సినిమాలో మరో రుస్తోమ్ బ్యూటీ ఇలియానా కూడా నటిస్తోంది. ఈ సినిమాను మిలాన్ లూథ్రియా డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ఇప్పుడు జరుగుతుంది. సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సిద్దం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/