Begin typing your search above and press return to search.

అబ్బా ఈషా.. ఏమిటీ రచ్చ

By:  Tupaki Desk   |   15 Nov 2018 8:26 AM GMT
అబ్బా ఈషా.. ఏమిటీ రచ్చ
X
ఈ రోజుల్లో గ్లామర్ గాళ్స్ పాపులారిటీ తెచ్చుకోవడానికి కేవలం సినిమాలే అవసరం లేదు. హాట్ హాట్ ఫొటో షూట్లు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసినా చాలు.. కావాల్సినంత పాపులారిటీ వస్తుంది. సినిమా అవకాశాలు తగ్గిన కొందరు హీరోయిన్లు ఇలాంటి షూట్లతోనే వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ భామ ఈషా గుప్తా ఇలాగే సూపర్ పాపులర్ అయింది. ఈషా చేసిన సినిమాలు తక్కువే కావచ్చు. కానీ ఆమెకు పాపులారిటీ మాత్రం తక్కువేమీ కాదు. ఐతే ఈ పాపులారిటీ కేవలం సినిమాల వల్ల వచ్చింది కాదు. తన హాట్ హాట్ ఫొటో షూట్లతో ఆమె కొన్ని నెలలుగా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందులోనూ ఆ మధ్య ఆమె చేసిన బికినీ ఫొటో షూట్ ప్రకంపనలు రేపింది. ఆమెను సోషల్ మీడియా క్వీన్ ను చేసింది.

తనకు సామాజిక మాధ్యమాల్లో తిరుగులేని ఫాలోయింగ్ రావడంతో డోస్ తగ్గించకుండా అదే స్థాయిలో హాట్ హాట్ ఫొటో షూట్లతో రచ్చ కొనసాగిస్తూనే ఉంది ఈషా. తాజాగా బికినీ అందాలతో ఈషా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో షూట్ చేసింది. ఎప్పట్లాగే క్లీవేజ్ అందాలతో రెచ్చిపోయిందామె. దీనిగురించి వర్ణించడానికి మాటలు రావు. చూసి తరించాలంతే. బ్లాక్ అండ్ వైట్ షూట్ వల్ల అందాలు మరింత ఎలివేట్ అయ్యాయి. ఒక ప్రత్యేకత వచ్చింది ఈ ఫొటో షూట్ కు. ఓవైపు అందాల్ని ఎక్స్ పోజ్ చేస్తూ.. తన హావభావాలతో ఒక రకమైన మత్తులో ముంచేస్తూ కుర్రాళ్ల మతులు పోగొట్టేస్తోంది ఈషా. ఫ్యాషన్ విషయంలో అయినా.. అందాల ఆరబోతలో అయినా తనకు తానే సాటి అని ఈషా ఈ ఫొటోతో మరోసారి రుజువు చేసింది. సినిమాల సంగతెలా ఉన్నా.. ఫ్యాషన్ వరల్డ్ లో మాత్రం ఆమె స్పీడుకు ఢోకా లేదనే చెప్పాలి.