Begin typing your search above and press return to search.

మాస్ మ‌స్తీ ఐటెమ్‌ కి హాటీ రెడీ

By:  Tupaki Desk   |   13 Dec 2018 4:13 AM GMT
మాస్ మ‌స్తీ ఐటెమ్‌ కి హాటీ రెడీ
X
సంక్రాంతి బ‌రిలో మోస్ట్ అవైటెడ్ మూవీగా రిలీజ్‌ కి రెడీ అవుతోంది `విన‌య విధేయ రామా`. రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి 11న రిలీజ్ కానుంది. ఇటీవ‌లే రిలీజైన టీజ‌ర్‌కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. బోయ‌పాటి ప‌క్కా కొల‌త‌ల‌తో తీస్తున్న సినిమా ఇది. ఫ్యామిలీ సెంటిమెంట్ - యాక్ష‌న్ - రొమాన్స్ కంటెంట్‌ తో రంగుల మ‌యంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడ‌ని ఆ టీజ‌ర్ చెప్పింది.

అంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమాలో ఏదైనా స్పెష‌ల్ ఉండాలి క‌దా? అని భావించిన మెగాభిమానుల‌కు ఆ లోటు తీర్చేందుకు అదిరిపోయే ప్లాన్ వేశాడు బోయ‌పాటి. స్పెష‌ల్ ట్రీట్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ ఇషా గుప్తానే బ‌రిలో దించుతున్నాడ‌ట‌. గ‌త కొంత‌కాలంగా త‌నవైన అంద‌చందాల‌తో అంత‌ర్జాలాన్ని హీటెక్కిస్తున్న ఇషా గుప్తా తో స్పెష‌ల్ నంబ‌ర్ ని చేయిస్తున్నాడు. చెర్రీ సినిమాల్లో ప్ర‌త్యేక గీతానికి ఉన్న ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. `రంగ‌స్థ‌లం` చిత్రంలో పూజా హెగ్డే స్పెష‌ల్ నంబ‌ర్ యూత్‌ కి కిర్రెక్కించింది. ఇప్పుడు ఆ మ్యాజిక్‌ ని తిరిగి రిపీట్ చేసేందుకు స‌రైన హాటీనే బోయ‌పాటి అండ్ టీమ్ ఎంపిక చేశార‌ని అభిమానులు భావిస్తున్నారు.

ఇషా గుప్తా గ‌త కొంత‌కాలంగా హాట్ ఫోటోషూట్ల‌తో చెల‌రేగిపోతున్న వైనం తెలిసిందే. ఈ బ్యూటీ లింగ‌రీ షోలు - బికినీ షోల గురించి యూత్ లో వాడి వేడిగా చ‌ర్చ సాగింది. బాలీవుడ్ లో ప‌లు క్రేజీ చిత్రాల్లోనూ ఈ అమ్మ‌డు న‌టిస్తోంది. ప‌నిలో ప‌నిగా అందాల పోటీల జ‌డ్జిగా సూప‌ర్‌ మోడ‌ల్‌ గా ఇషా వ‌న్నె చిన్నెలు ఐటెమ్ నంబ‌ర్‌ కి ప్ల‌స్ అవుతాయ‌ని అంతా భావిస్తున్నారు. మొత్తానికి ఇషా వెలుగులు మెగా ఫ్యాన్స్‌ కి - తెలుగు ఆడియెన్‌ కి కిక్కివ్వ‌డం ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. తాజాగా రివీల్ చేసిన హాట్ ఫోటో షూట్ వెబ్‌ని వేడెక్కిస్తోంది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న కియ‌రా అద్వాణీ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.