Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఈషా రచ్చ పీక్స్ అంతే..

By:  Tupaki Desk   |   19 Nov 2017 4:18 AM GMT
ఫోటో స్టోరీ: ఈషా రచ్చ పీక్స్ అంతే..
X
కథానాయికగా ఈషా గుప్తాకు అంత గొప్ప పేరేమీ రాలేదు. ఆమెను ఎప్పుడూ చిన్న స్థాయి హీరోయిన్ గానే చూస్తూ వచ్చారు బాలీవుడ్ జనాలు.. ప్రేక్షకులు. కానీ సినిమాలతో తెచ్చుకున్న గుర్తింపు కంటే ఆమె ఫొటో షూట్లే ఎక్కువ పేరు తెచ్చిపెట్టాయి. గత కొన్ని నెలల్లో భారతీయ సినీ ప్రియుల్లో అత్యంత చర్చనీయాంశం అయిన ఫొటో షూట్లు ఎవరివి అంటే మరో మాట లేకుండా ఇషా గుప్తావే అని చెప్పేయొచ్చు. లో దుస్తులతో ఆమె ఇచ్చిన పోజులకు కుర్రాళ్ల మతులు పోయాయంతే. ఒక హాట్ ఫొటో షూట్ నుంచి తేరుకోకముందే ఇంకో సెన్సేషనల్ ఫొటో షూట్ తో రసిక ప్రియుల్ని ఉర్రూతలూగిస్తూ వస్తోంది ఈషా. ప్రతిసారీ డోస్ పెంచేస్తుంటే కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు.

తాజాగా ఆమె ఒక మ్యాగజైన్ కోసం రెడ్ డ్రెస్సులో రెచ్చిపోయింది. ఈషా ఇంతకంటే ఎక్కువగా అందాల ప్రదర్శన చేసింది కానీ.. ఇందులో ఆమె ఉన్నంత హాట్ నెస్ ఇంతకుముందెన్నడూ లేదనే చెప్పాలి. ఆమె ఇచ్చిన పోజు.. ఎక్స్ ప్రెషన్ ఆ రేంజిలో కిక్కిస్తున్నాయి. ఇక తర్వాతి దశలో ఈషా పోజులు ఎలా ఉంటాయో అని చూస్తున్నారు కుర్రాళ్లు.