దుబాయ్ షేక్ లు షేకవ్వాలి!

Sat Nov 17 2018 11:34:21 GMT+0530 (IST)

టూపీస్ - బికినీలో అందాలు ఆరబోయడం టాప్ మోడల్ కం బాలీవుడ్ హాటీ ఇషా గుప్తాకు కొత్తేమీ కాదు. మ్యాగజైన్ కవర్ పేజీలపై అందాల ఆరబోత ఈ భామకు అసలే కొత్తకాదు.  మ్యాగ్జిమ్ - హలో - ది వుమెన్ వంటి ప్రఖ్యాత మ్యాగజైన్ లపై ఇషా ఇచ్చిన ఫోజులు గతంలో సంచలనం అయ్యాయి. వీటికి తోడు నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లను ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా నెటిజనుల్ని ఆకర్షిస్తోంది.ఇటీవల ప్రఖ్యాత మ్యాగ్జిమ్ కవర్ షూట్ తోనూ అంతే హీటెక్కించింది. ఇప్పుడు మరోమారు సామాజిక మాధ్యమాల వేదికగా గుబులు రేపే ఫోటోల్ని ఇషా అభిమానులకు షేర్ చేస్తోంది. తాజా ఫోటోలో టూపీస్ లో దర్శనమిచ్చిన ఈ భామ హలో దుబాయ్! అంటూ పలకరించింది. దీనర్థం.. ప్రస్తుతం దుబాయ్ లోని ఎగ్జోటిక్ లొకేషన్ లో ఇషా గుప్తా జాలీ ట్రిప్ లో ఉందని అర్థమవుతోంది. తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో బోయ్స్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అయిపోతోంది.

2007లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న ఇషా గుప్తా ఒక టాప్ మోడల్ గా అందాల రాణుల ట్రైనర్ గా  అందాల పోటీల జడ్జిగా కొనసాగుతోంది. ఇటీవలే ఫెమినా మిస్ ఇండియా హంట్ పోటీలకు ఇషా జడ్జిగా కొనసాగింది. మరోవైపు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా ఇషా పాపులరవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో అరడజను చిత్రాల్లో నాయికగా నటిస్తోంది.  హేరా ఫేరి 3 - టోటల్ ధమాల్ - డెవిల్స్ డాటర్ - దేశి మ్యాజిక్ - వన్ డే .. చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో టోటల్ ధమాల్ రిలీజ్ కి రెడీ అవుతోంది.