దేశంలో అమ్మాయిలంతా పెళ్లికి రెడీ!

Tue Jun 11 2019 01:05:06 GMT+0530 (IST)

ప్రభాస్ ని అందరూ డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో.. అతడి సన్నిహితులు.. స్నేహితుల కంటే ఎంతో గొప్పగా వర్ణించి చెప్పింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఒకప్పుడు ఎంతో మంది అమ్మాయిలు ప్రభాస్ ని పెళ్లాడాలని వేచి చూసేవారు. అది బాహుబలి కి ముందు మాట. ఆ సినిమా రిలీజ్ తర్వాత దేశంలోని అమ్మాయిలంతా తనని పెళ్లాడాలని ఆశపడ్డారు! అంటూ డార్లింగ్ ని ఆకాశానికెత్తేసింది.ఐదేళ్ల పాటు తెరకెక్కించిన బాహుబలి 1 - 2 సినిమాల కోసం అనుష్క - తమన్నా ఇద్దరూ ఎంతో శ్రమించారు. అందుకే ప్రభాస్ గురించి ఆ ఇద్దరికీ కాకుండా ఇంకెవరికి ఇంత బాగా తెలుస్తుంది. పైగా డార్లింగ్ ప్రభాస్ సరసన రెబల్ లాంటి బారీ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది. అందుకే ప్రభాస్ గురించి ఎన్నో రహస్యాలు తను ఓపెన్ చేయగలదు. ``ప్రభాస్ ఎంతో సాఫ్ట్. దయార్ధ్ర  హృదయం కలిగిన మనిషి. కింగ్ అతడు. అమరేంద్ర బాహుబలి లా రాజాధిరాజు.. అంత గొప్ప మనసు తనది... అంటూ అతిశయోక్తిగా పొగడ్తల వర్షం కురిపించింది.

అవును నిజమే! తమన్నా చెప్పినట్టే అతడు కింగ్ లాంటోడే! మనసున్న మారాజే. అతడంటే దేశవ్యాప్తంగా ఉన్న మగువలు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. ప్రస్తుతం సాహో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆగస్టు 15 తర్వాత తనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం ఇంటర్నేషనల్ లెవల్ కి పెరుగుతుందేమో. ఇన్నాళ్లు దేశంలోని అమ్మాయిలు మాత్రమే అతడిని పెళ్లాడాలనుకున్నారు. సాహో రిలీజైతే అది హాలీవుడ్ రేంజు కాబట్టి దేశ- విదేశాల్లో అమ్మాయిలంతా అతడినే పెళ్లాడాలనుకుంటే పరిస్థితేంటి? అన్నది వేచి చూడాలి. అన్నట్టు.. డార్లింగ్ పెళ్లి విషయంలో ఇన్ని సంగతులు చెప్పింది కదా.. అతడి విషయంలో తమన్నా ఒపీనియన్ ఏంటో?  చెబితే కోస్టార్ ఎవరైనా కంగారు పడతారని అనుకుందా? పెదనాన్న పెళ్లి చేసేస్తానని వెంటపడినా నేడు - రేపు అని తప్పించుకుంటున్న డార్లింగ్ కనీసం సాహో తర్వాత అయినా పెళ్లాడేస్తాడా?