Begin typing your search above and press return to search.

జూనియర్ బాషా.. టీజర్ అదరగొట్టాడు

By:  Tupaki Desk   |   28 April 2016 5:30 PM GMT
జూనియర్ బాషా.. టీజర్ అదరగొట్టాడు
X
సూపర్ స్టార్ రజినీకాంత్ కి టాలీవుడ్ లో స్టార్ హీరో స్టేటస్ అందించిన మూవీ సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన బాషా. ఆ మూవీలో రజినీకాంత్ మొదట ఫైట్ చేసే కంటే ముందే.. ఆటోవాలా డ్రస్ లో ఉన్న రజినీని రౌడీలు ఓ స్తంభానికి కట్టేసి చితక్కొడతారు. అదే స్టిల్ తన ఓ మూవీ ఫస్ట్ లుక్ గా ఇచ్చి జీవీ ప్రకాష్ కుమార్ అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఆ సినిమా పేరే 'ఎనక్కు ఇన్నోరు పేరు ఇరుక్కు'. తెలుగులో అయితే 'నాకు ఇంకో పేరుంది'. అఫ్ కోర్స్ కూడా అదే సినిమాలో రజినీ ఫేమస్ డైలాగ్. ఈ టైటిల్ పై బాషా థీమ్ నే తీసుకుని.. సినిమా చేసేశాడు హీరో కం మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్. ఇప్పుడా మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది. ఫస్ట్ లుక్ - టైటిల్ లో రజినీని కాపీ కొట్టినా.. ట్రైలర్ లో మాత్రం ఆ ఫ్లేవర్ ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు శామ్ యాంటన్. యాక్షన్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది.

గతంలో జీవీ ప్రకాష్-శామ్ యాంటన్ లు కలిసి డార్లింగ్ (ప్రేమ కథా చిత్రం రీమేక్) ను తెరకెక్కించారు. ఇది సూపర్ హిట్ కావడంతో.. ఈ ప్రాజెక్ట్ పై అంతటా ఆసక్తి నెలకొంది. ఎనకు ఇన్నోరు పేరు ఇరుక్కు సినిమాని లైకా ప్రొడక్షన్స్ ను నిర్మిస్తోంది. విజయ్ తో కత్తి తర్వాత.. ఆ సంస్థ నుంచి వస్తున్న మూవీ ఇదే. ఇప్పుడు విడుదల చేసిన టీజర్ ఆకట్టుకోగా.. నిరోషా - శరవణన్ ల పాత్రలు ఆసక్తి కలిగిస్తున్నాయి.