ఫోటో స్టొరీ: సెక్సీ పోజిచ్చిన స్వీడన్ భామ

Tue Jun 11 2019 13:40:16 GMT+0530 (IST)

మనకు ఇక్కడ టాలీవుడ్ లో నార్త్ భామల హవా ఎక్కువ కదా. అదే బాలీవుడ్ లో విదేశీ భామల హవా ఎక్కువ.  కత్రినా కైఫ్.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఎవెలిన్ శర్మ..  మహిరా ఖాన్.. మందన కరీమి.. ఇలా  చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది.  ఆఖరికి అలియా భట్ కూడా కెనడా సిటిజెన్. ఇండియన్ కాదు.  ఈ విదేశీ భామ లిస్టులో ఉన్న మరో భామ ఎల్లి అవ్రామ్.  బిగ్ బాస్ షో ద్వారా ఇండియాలో అడుగుపెట్టిన ఈ స్వీడన్ భామ తర్వాత క్యామియోలు.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ బాలీవుడ్ లో భారీ గుర్తింపు తెచ్చుకుంది.  అల్లు అర్జున్ 'నాపేరు సూర్య' సినిమాలో 'ఇరగ ఇరగ' సాంగ్ కు స్టెప్పులేసింది. 



ఇంకా ఈ ఎల్లి ఎవరు నాకు గుర్తురాలేదంటే మీకు టక్కున గుర్తొచ్చే ఉదాహరణ చెప్పాల్సిందే. కొంత కాలం క్రితం క్వీన్ తమిళ రీమేక్ 'పారిస్ పారిస్' టీజర్ రిలీజ్ అయింది.  ఆ టీజర్ లో కాజల్ బ్రెస్ట్ ను అల్లరిగా నొక్కిన సుందరీమణి.. చిలిపి నారీమణి ఈ ఎల్లి. ఇప్పుడు ఎల్లి పాప గుర్తొచ్చే ఉంటుంది లెండి! సరే.. టాపిక్ లోకి వెళ్లిపోదాం.  ఈ భామ సోషల్ మీడియాలో యమా యాక్టివ్.  హాట్ ఫోటో షూట్స్ లో పాల్గొనడం వెన్నతో పెట్టిన విద్య.  అంతే కాదు మ్యాగజైన్ కవర్ పేజీలపై ఎంతో ఘాటుగా పోజులిస్తుంది.

తాజాగా ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ కోసం ఈ భామ ఫోటో షూట్ చేసింది. ఒక హైఫై బార్ కౌంటర్ దగ్గర ఎంతో స్టైలిష్ గా కూర్చొని పోజిచ్చింది. ఒక చైర్లో రివర్స్ గా కూర్చొని తన అందాలను ఒడుపుగా వడ్డించింది.  రింగుల జుట్టు.. వెడల్పాటి ఇయర్ రింగులు ఎల్లికి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.  నేపథ్యంలో ఉన్న అరల్లో ఎన్నో లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి.  బార్ కౌంటర్ లో ఒక అందమైన గ్లాసులో వైన్ కూడా ఉంది.  అయితే అవన్నీ ఎల్లి అందాల ముందు దిగదుడుపే.  అయితే 'తాగితే పోతారు' అని ప్రతి ఒక్కరూ వార్నింగ్ ఇస్తుంటారు కానీ ఈ ఫోటోకు 'ఎల్లిని చూస్తే పోతారు' అని కూడా హెచ్చరిక చెయ్యాలి.  ఎక్కడికి పోతారు.. ఎందుకు పోతారు అని వెర్రి మొర్రి ప్రశ్నలు అడక్కండి. ఎవరి ఊహాశక్తికి తగ్గట్టు వారు ఊహించుకోవాలి అంతే. ఎల్లి నటించే సినిమాల విషయానికి వస్తే తమిళంలో 'ప్యారిస్ ప్యారిస్'.. కన్నడలో 'బటర్ ఫ్లై'.. హిందీలో 'మలంగ్' అనే చిత్రాలలో నటిస్తోంది.