Begin typing your search above and press return to search.

బన్నీ సినిమాలో ఐటెం ఎవరంటే..

By:  Tupaki Desk   |   19 March 2018 4:25 AM GMT
బన్నీ సినిమాలో ఐటెం ఎవరంటే..
X
సమ్మర్ కి వస్తున్న క్రేజీ మూవీస్ లో అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య కూడా ఉంది. ఈసారి సమ్మర్ కు వస్తున్న భారీ చిత్రాలలో ఇప్పటివరకూ షెడ్యూల్ అయినవాటిలో నా పేరు సూర్యనే చివరి రిలీజ్. మే 4వ తేదీ వస్తున్న నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియాను.. ఫుల్ ప్లెడ్జెడ్ గా ప్రిపేర్ చేసేస్తున్నాడు దర్శకుడు వక్కంతం వంశీ.

దేశభక్తి యాంగిల్ లో రూపొందే ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉండకపోవచ్చని ఇప్పటివరకూ అంతా భావించారు. కానీ.. ఈ మూవీలో స్వీడిష్ భామ ఎల్లి ఆరామ్ తో ఐటెం పాట చేయించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ సుందరి చెప్పింది. ప్రస్తుతం క్వీన్ తెలుగు వెర్షన్ లో నటిస్తున్న ఎల్లి.. అప్పుడే మరో టాలీవుడ్ మూవీని అందుకోవడమే కాదు.. షూటింగ్ కూడా పూర్తి చేసేశానని అంటోది. స్లో సాంగ్ అంటున్న ఎల్లి ఆరామ్.. ఇదో ఫోక్ నంబర్ అని చెప్పింది. హైద్రాబాద్ లోని పరిసరాల్లో షూటింగ్ నిర్వహించారట. తనకు ఇదే తొలి తెలుగు సినిమా అని ఎల్లి చెప్పడం విశేషం.

అల్లు అర్జున్ ని విపరీతంగా అభిమానిస్తానని చెప్పిన ఎల్లి.. బన్నీ డ్యాన్స్ మూమెంట్స్ తెగ ఎంజాయ్ చేస్తుందట. సీటీ మార్ పాట తన ఫేవరెట్ నంబర్ అంటోంది ఎల్లి. అయితే.. బన్నీతో కలిసి నటించే అవకాశం రావడంతో తను చాలా సంతోషించినా.. ఈ పాటలో తను మాత్రమే డ్యాన్స్ చేస్తానని చెప్పింది ఎల్లి ఆరామ్. ఈ పాట ద్వారా బాగున్నారా.. మంచి వంటి కొన్ని తెలుగు పదాలను కూడా నేర్చుకుందట ఈ భామ.