సెక్స్ కంటెంట్ తీస్తూనే ఉంటాను

Sun Dec 09 2018 16:32:02 GMT+0530 (IST)

అంతే మనం చేసిన పనిని సమర్దించుకోవాలి అంటే ఎంతకైనా దేనికైనా లింక్ పెడుతూ మాట్లాడే వాళ్లకు సినిమా పరిశ్రమలో కొదవలేదు. టీవీ సీరియల్స్ లో విప్లవాన్ని తీసుకొచ్చిన బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ ఇటీవలే అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలు వెబ్ సిరీస్ లు ఎక్కువగా తీస్తోంది. ఇటీవలే తమ సొంత వీడియో స్ట్రీమింగ్ యాప్ కోసం తీసిన ట్రిపుల్  ఎక్స్ అన్ సెన్సార్డ్ అనే సిరీస్ లో కంటెంట్ మరీ ఘాటుగా ఉండటమే కాదు విమర్శకులకు బోలెడు పని కల్పించింది. అయినా ఏక్తా ఇలా చేయడం ఇది మొదటిసారి కాదు.రాగిణి ఏంఏంఎస్ తీసినప్పుడే క్రిటిక్స్ ఆమె మీద విరుచుకు పడ్డారు. అయితే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోయిన ఏక్తా కపూర్ ఫైనల్ గా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది. సెక్స్ ని బేస్ చేసుకుని సినిమాలు సీరియల్స్ తీయడం పట్ల తనకు ఫీలింగ్ ఏమి లేదని పైపెచ్చు చాలా గర్వంగా ఉందని సెలవిచ్చింది. మరి విమర్శల మాటేమిటి అని అడిగితే ఈ దేశంలో అందరికి డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని ఒక్కొక్కరి కి ఒక్కో న్యాయం అమలవుతోందని సెక్సువల్ క్రైమ్స్ కంటే తాను తీసేవి అసలు ప్రమాదం  కాదని చెబుతోంది.

అంతా బాగానే ఉంది కాని బూతులతో సినిమాలు తీసి ఏదో పెద్ద అవగాహనా కల్పించే బృహత్తర కార్యక్రమం చేపడుతున్నట్టు మాటలు చెబుతున్న ఏక్తా కపూర్ తీరు చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. దానికి దేశానికి లింక్ పెట్టి ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని నిందలు వేయడం ఏమిటని నిలదీస్తున్నారు. అయినా ఏక్తా అవేవి పట్టించుకునే స్థితిలో లేదు. రాగిణి కొత్త సిరీస్ ఆల్రెడీ అయిపోవచ్చిందట. అది చూస్తే అంతే సంగతులు అని ఇన్  సైడ్ టాక్.