Begin typing your search above and press return to search.

ఎనిమిది రిలీజ్‌ ల‌తో ఎండ్ గేమ్!

By:  Tupaki Desk   |   22 April 2019 8:07 AM GMT
ఎనిమిది రిలీజ్‌ ల‌తో ఎండ్ గేమ్!
X
ఓ వైపు బాక్సాఫీస్ పై సునామీలా ఎటాక్ చేస్తోంది `అవెంజ‌ర్స్- ఎండ్ గేమ్`. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే 500 థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతున్న ఈ చిత్రం దేశ‌వ్యాప్తంగా వేలాది థియేట‌ర్ల‌ను క‌బ్జా చేసిందన్న చ‌ర్చ సాగుతోంది. అయితే అవెంజ‌ర్స్ దూకుడు గురించి చ‌ర్చ సాగుతున్న వేళ అదేమీ ప‌ట్టించుకోకుండా ఏకంగా ఎనిమిది చిన్న సినిమాల్ని టాలీవుడ్ లో రిలీజ్ చేసే సాహ‌సం చేయ‌డం ట్రేడ్ లో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. మార్వ‌ల్ రూపొందించిన ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `అవెంజర్స్: ఎండ్ గేమ్` క్రేజు అంత‌కంత‌కు స్కైని ట‌చ్ చేస్తోంది. ఈ సినిమా 3డి వెర్ష‌న్.. ఐమ్యాక్స్ 3డి వెర్ష‌న్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. దీంతో మెట్రోల్లో మ‌ల్టీప్లెక్సులు ఆల్మోస్ట్ ఫుల్ అయ్యాయ‌ని బుక్ మై షో చెబుతోంది.

కార‌ణం ఏదైనా ... ఈ వారం చిన్న సినిమాలకు అనుకూలం కాద‌ని ట్రేడ్ లో చ‌ర్చ సాగుతోంది. ఇప్ప‌టికే మూడు హిట్ సినిమాలు థియేట‌ర్ల‌లో రన్నింగ్ లో ఉన్నాయి. నాగ‌చైత‌న్య- మ‌జిలీ .. నాని- జెర్సీ.. సాయిధ‌ర‌మ్ - చిత్ర‌ల‌హ‌రి ఆడుతుండ‌గానే .. మ‌రోవైపు అవెంజ‌ర్స్ దూసుకొస్తోంది. అయినా మ‌రో ఏడు చిన్న సినిమాలొస్తున్నాయి. వీటిలో దిక్సూచి- డేంజ‌ర్ ల‌వ్ స్టోరి-దుప్ప‌ట్లో మిన్నాగు- నువ్వు తోపురా స్ట్రెయిట్ సినిమాలు కాగా.. 90 ఎంఎల్- గీతా చ‌లో- య‌మ‌లోకం వంటి డ‌బ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. వీటిలో బిగ్ బాస్ ఓవియా న‌టించిన 90 ఎంఎల్ హాట్ టీజ‌ర్ .. పోస్ట‌ర్ల వ‌ల్ల యూత్ లో కొంత మేర టాక్ వినిపిస్తోంది.

ర‌ష్మిక లాంటి క్రేజీ నాయిక న‌టించ‌డంతో `గీతా చ‌లో` అనువాద చిత్రానికి యువ‌త‌రంలో టాక్ ఉంది.ఇక‌పోతే మిగ‌తా చిన్న సినిమాల గురించి బ‌య‌ట తెలియ‌నే తెలీదు. ఇవ‌న్నీ రిలీజ్ కి తేదీ ఫిక్స్ చేసుకున్నా.. ఇంకా ఈ వారం రావాలో వ‌ద్దా అన్న సందిగ్ధ‌త నిర్మాత‌ల్లో నెల‌కొందిట‌.

తెలుగు రాష్ట్రాల్లో కిడ్స్ - యూత్‌ లో అసాధార‌ణ క్రేజు ఉన్న‌ అవెంజ‌ర్స్ కి ఇప్ప‌టికే ఎక్కువ థియేట‌ర్ల‌ను కేటాయించారు కాబ‌ట్టి ఇత‌ర సినిమాల‌కు థియేట‌ర్ల స‌ర్ధుబాటు ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఎనిమిదిలో.. `గీత ఛలో`, 90 ఎంఎల్ చిత్రాల‌కు ప్రిఫరెన్స్ ఇచ్చే వీలుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఏ విధంగా చూసినా ఈ శుక్ర‌వారం ఇత‌ర చోటా మోటా సినిమాల‌ రిలీజ్ ల‌కు కరెక్ట్ కాద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది.