Begin typing your search above and press return to search.

గోవాలో ఎగిరెగిరే పాటేసుకున్న చైతు!

By:  Tupaki Desk   |   19 Aug 2018 12:14 PM GMT
గోవాలో ఎగిరెగిరే పాటేసుకున్న చైతు!
X
అక్కినేని నాగ చైతన్య తాజా చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు' ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ప్రేక్షకుల్లో - అక్కినేని అభిమానుల్లో సినిమాపై ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే టీజర్ - ఇతర ప్రోమోస్ తో ఆకట్టుకున్న 'శైలజారెడ్డి అల్లుడు' టీమ్ తాజాగా ఒక మెలోడీ సాంగ్ వీడియో ప్రోమోతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

'ఎగిరెగిరే' అంటూ సాగే ఈ మెలోడీని గోవా లో ఉన్న బ్యూటిఫుల్ బీచ్ లతో పాటుగా ఇతర అందమైన లోకేషన్స్ లో తెరకెక్కించారు. చైతు-అను ఇమ్మాన్యుయేల్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ అదిరిపోయింది. సిడ్ శ్రీరామ్ -లిప్సిక ఈ పాటను పాడారు. గోపి సుందర్ మోలోడీ ట్యూన్ కు సిడ్ వాయిస్ పర్ ఫెక్ట్ గా సూట్ అయింది.

ఈ సినిమాలో రమ్యకృష్ణ చైతు అత్తగారిగా ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఒకవైపు ఈ పవర్ ఫుల్ అత్త మరోవైపు ఈగోతో చంపే ఆమె కూతురు అను లమధ్య మన చైతు పరిస్థితి ఎలా ఉంటుందో మరి. మారుతి దర్శకత్వంలో తెరకకెక్కుతున్న ఈ సినిమా ఆగష్టు 31 న విడుదలకు సిద్ధం అవుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.