నందమూరి ఫ్యాన్స్ కి ఉమ్మ!!

Sun Oct 21 2018 21:55:16 GMT+0530 (IST)

తెలుగమ్మాయి ఇషా రెబ్బా స్పీడ్ చూస్తుంటే వారెవ్వా అనకుండా ఉండలేం. కెరీర్ తొలి భారీ చిత్రం `అరవింద సమేత- వీర రాఘవ`లో ఈ భామ చెల్లెమ్మ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. తన పాత్రలో ఆకట్టుకుందా లేదా అన్నది అటుంచితే ఈ మూవీ ప్రమోషన్స్ లో ఇష తనని తాను ప్రమోట్ చేసుకున్న తీరును మెచ్చుకోవాల్సిందే. సినిమా గాలి.. సినిమా వాసనను ఇష ఈ కొద్ది పాటి ఎక్స్ పీరియెన్స్ లోనే ఎంతో బాగా క్యాచ్ చేసినట్టు అనిపిస్తోంది. ఇంతకుముందు ప్రీరిలీజ్ ఈవెంట్ లో తారక్ ని - త్రివిక్రమ్ ని హైలైట్ చేస్తూ మాట్లాడిన ఇష నందమూరి అభిమానుల్ని ఓ రేంజులో గాల్లోకి ఎత్తేసింది.నేటి సక్సెస్ వేదికపైనా అంతే జోష్ గా కనిపించింది ఇష. హుషారు కేరాఫ్ ఇష అన్న చందంగా కనిపించింది. సక్సెస్ ని అలా ఎంజాయ్ చేస్తున్నా అంటూనే.. ఈ సెలబ్రేషన్ కి కారణమైన నందమూరి అభిమానులకు ఒక `ఉమ్మ!` కూడా పడేసింది. ఉమ్మ అంటే అదేమీ మామూలు ఉమ్మ కాదు.. ఘాటైన చుమ్మ! అంటే నమ్మండి. ఇంకా అభిమానులను ఉద్ధేశించి చాలానే మోసేసింది.

ఈ విజయంలో భాగమైనందుకు - ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు.. అవకాశమిచ్చిన త్రివిక్రమ్ కి థాంక్స్. మళ్లీ మీతో కలిసి పని చేస్తానని భావిస్తున్నాను. తారక్ గారితో పని చేయడం సంతోషం. ఆయన ఎంతో డెడికేటెడ్ స్టార్. పూజా స్వీట్ హార్ట్. ఇంత పెద్ద సక్సెస్ చేసిన అభిమానులందరికీ చాలా కృతజ్ఞతలు.. అని తెలిపింది.

ఇదే వేదికపై మదర్ పాత్రధారి ఈశ్వరి మాట్లాడుతూ అంతే పెద్ద సర్ ప్రైజ్ ని ఇచ్చారు . ``ఆర్టిస్టు ఎక్కువ చేస్తున్నాడు అంటే హీరోలే తగ్గించేస్తారనేది చాలా సార్లు విన్నాను``. కానీ ఆడవాళ్ల పాత్రలతో తెరకెక్కించిన ఈ సినిమాలో మమ్మల్ని ప్రోత్సహించినందుకు తారక్ - త్రివిక్రమ్ కి ధన్యవాదాలు అని అన్నారు.