Begin typing your search above and press return to search.

త్రివిక్రమ తారకరామసమేత ఈష!

By:  Tupaki Desk   |   19 Sep 2018 4:35 PM GMT
త్రివిక్రమ తారకరామసమేత ఈష!
X
ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అరవింద సమేత' మరో ఇరవై రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మెల్లగా ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి ఇప్పటికే మొదటి సింగిల్ ని రిలీజ్ చేసిన 'అరవింద సమేత' టీమ్ తాజాగా రెండో సింగిల్ 'పెనిమిటీ' ని రిలీజ్ చేసింది. ఇక 20 వ తేదీన ఫుల్ ఆడియో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈషా రెబ్బా తనవైపునుండి కాస్త హంగామా అవసరం అనుకుందేమో గానీ ఒక ట్విట్టర్ అప్డేట్ ఇచ్చింది.


ఎన్టీఆర్ - త్రివిక్రమ్ లతో ఒక సెల్ఫీ తీసుకొని దాన్నితన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. 'విత్ ది కూలెస్ట్ పీపుల్ ఆన్ ది సెట్స్'అంటూ దానికి అరవింద సమేత.. తారక్.. త్రివిక్రమ్ హ్యాష్ టాగ్ లను జోడించింది. నిజమే ఎన్టీఆర్.. త్రివిక్రమ్ లు కూలెస్ట్ పర్సన్స్. వాళ్ళతో షూటింగ్ లోకేషన్ లో సెల్ఫీ అంటే అది స్పెషలే కదా. అచ్చతెలుగు అమ్మాయి అయిన ఈష ఇప్పటికే తన కెరీర్లో మంచి విజయాలు సాధించిందిగానీ ఈ సినిమా తనకు ఫస్ట్ స్టార్ హీరో ఫిలిం. సెకండ్ లీడ్ అని ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే పాత్ర కాదని గతంలోనే ఒక ఇంటర్వ్యూ లో స్పష్టం చేసింది. సినిమా మొదటి నుండి చివరివరకూ తన పాత్ర ఉంటుందట.

ఈ సినిమా హిట్ అయితే స్టార్ హీరోయిన్స్ లీగ్ లోకి చేరడం ఖాయమని నమ్మకంగా ఉందట. మరి నిజంగానే ఈ సినిమా హిట్ కావాలని - ఈషా స్టార్ హీరోయిన్ గా మారాలని కోరుకుందాం. ఎంతైనా మన తెలుగమ్మాయి కదా!