Begin typing your search above and press return to search.

రెబ్బా ఇలా జరిగిందేంటబ్బా!!

By:  Tupaki Desk   |   19 Oct 2018 11:56 AM GMT
రెబ్బా ఇలా జరిగిందేంటబ్బా!!
X
సాధారణంగా స్టార్ హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా వేషం దక్కినా సరే అప్ కమింగ్ హీరోయిన్లకు అదో మంచి అవకాశంలా ఉపయోగపడుతుంది. ఇందుకు గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. రమ్యకృష్ణ-మీనా-రోజా లాంటివాళ్ళు ముందు సపోర్టింగ్ రోల్స్ లో ప్రూవ్ చేసుకున్నాకే స్టార్ హీరోయిన్ల స్థాయికి చేరుకున్నారు. ఇదే అంచనాతోనే ఈషా రెబ్బా అరవింద సమేత వీర రాఘవ ఒప్పుకుంది. కానీ తీరా చూస్తే తనకు కలిగిన ప్రయోజనం మాత్రం శూన్యం.

ఈ ఆఫర్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ సరసన అందులోనూ త్రివిక్రమ్ దర్శకత్వం అంటే ఎస్ చెప్పడానికి ఇంత కంటే కారణం కావాలా. ఈషా అదే చేసింది. కానీ హీరోయిన్ పూజా హెగ్డే చెల్లిగా తనది పూర్తిగా పరిమితమైన పాత్ర కావడంతో పెర్ఫార్మన్స్ సంగతి పక్కన పెడితే ఉన్న కాసిన్ని సీన్లు కత్తిరించలేదు హమ్మయ్య అనుకోవాల్సి వచ్చింది. పెనివిటి సాంగ్ లో కనిపించేది ఈషానే అయినప్పటికీ తనను పట్టించుకునే స్థితిలో ప్రేక్షకులు లేరు. తమన్ తారక్ ల మేజిక్ లో పడిపోయారు.

నిజానికి విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్ లో ఈషా మాట్లాడుతూ అత్తారింటికి దారేది ప్రణీత లాంటి పాత్ర అయితే ఒప్పుకునే దాన్ని కానని చాలా ప్రాధాన్యత ఉండటం వల్లే చేస్తున్నాను అని చెప్పింది. నిజానికి ఆ ప్రణీత పాత్రే బెటర్. పవన్ కళ్యాణ్ తో బ్లాక్ బస్టర్ సాంగ్ లో డాన్స్ చేసే అవకాశం దక్కింది. ఉంగరాల్లాంటి కళ్ళు తిప్పింది అంటూ సాగే ఆ పాట ఇప్పటికీ హాట్ ఫెవరెటే. కానీ అరవింద సమేతలో అంత ఛాన్స్ కూడా లేకపోయింది. పూజా హెగ్డేకే రెండు పాటలు ఉన్నప్పటికీ ఇక ఈషా మీద ఉండే ఛాన్స్ లేదు కదా.

సో ఈషాకు దీని వల్ల కలిగిన లాభమైతే జీరోనే. అందుకే సుమంత్ సరసన అతని 25వ సినిమా సుబ్రమణ్యపురం మీదే ఆశలన్నీ పెట్టుకుంది. దీనికి ముందు చేసిన బ్రాండ్ బాబు నిరాశ కలిగించింది. అరవింద సమేత బ్లాక్ బస్టర్ అయినా తనకు లాభం లేకుండా పోయింది. అంతే టాలీవుడ్ ముద్దుగుమ్మల కథలు ఇలాగే ఉంటాయి. ఏది ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో కాలమే సమాధానం చెప్పాలి.