ఫోటో స్టొరీ: అందాలను ఆరబోసింది!

Wed Dec 05 2018 15:53:32 GMT+0530 (IST)

సోషల్ మీడియాలో హీటు పెంచి నెటిజనులకు నిద్రలేకుండా చేసేవారి లిస్టులో ఈషా గుప్తా పేరు టాప్ లోనే ఉంటుంది.  2007 లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకున్న ఈ బ్యూటీ ఫ్యాషన్ షోలంటే కొట్టినపిండే. ఆ ఫ్యాషన్ షోలతో పాటు సోషల్ మీడియాలో కూడా గ్లామర్ షోలు చేస్తూనే ఉంటుంది.  తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  దీనికి క్యాప్షనే ఇవ్వలేదు. అంటే నెటిజనులనే ఆ క్యాప్షన్ ఇచ్చుకోమని ఈషా ఉద్దేశం కాబోలు. అందుకే జనాలు రెచ్చిపోయి మరీ హాటు కామెంట్లు పెట్టారు. ఒకరు వెరీ సెక్సీ.. వెరీవెరీ హాట్ అన్నారు.. మరొకరు 'తబాహీ హై తబాహీ'(విధ్వంసం) అన్నారు. ఇంతకీ ఎందుకు నెటిజనులు ఇంతలా రియాక్ట్ అయ్యారు? తన అందాలను ఫుల్లుగా ఆరబోసింది. క్లీవేజ్ సోకులకు నెటిజనుల మతి చెడింది.  అదేదో సినిమాలో అన్నట్టు వస్త్రాన్ని కప్పుకోవాల్సిన చోట కప్పుకోకుండా ఒక సెక్సీ ఎక్స్ ప్రెషన్ తో నిలబడింది. మెడలో చైన్లు క్లీవేజ్ ను హైలైట్ చేస్తూ కిందవరకూ ఉన్నాయి.  ఓవరాల్ గా గ్రీకు సుందరిలాగా ఉంది.

ఈ సోకుల ఆరబోతల కామనేగానీ చేతిలో సినిమాలు కూడా ఫుల్లుగానే ఉన్నాయి.  'హేరా ఫేరీ 3'.. 'టోటల్ ధమాల్' క్రేజీ బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా మరో మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి