Begin typing your search above and press return to search.

దీన్ని క్రియేటివిటీ అందామా!!

By:  Tupaki Desk   |   21 Oct 2018 10:41 AM GMT
దీన్ని క్రియేటివిటీ అందామా!!
X
ఒకపక్క విభిన్నమైన కాన్సెప్ట్స్ తో తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుంటే మరోపక్క ప్రేక్షకులను ఆకర్షించే వంకతో యూత్ బలహీనతను ఆసరాగా చేసుకుని కొందరు దర్శక నిర్మాతలు వింత పోకడకు పోవడాన్ని ఏ రకంగానూ సమర్ధించే అవకాశం లేకుండా పోతోంది. ఉదాహరణే ఈ ఏడు చేపల కథ సినిమా. పోస్టర్ చూస్తున్నారుగా. వర్ణించే అవసరం లేకుండా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో. కాకపోతే ఈ మధ్య వస్తున్న లిప్ కిస్సుల ట్రెండు రొటీన్ గా మారిన నేపధ్యంలో కుర్రకారు ఎగబడి సినిమాకు రావాలంటే ఏదైనా వెరైటీగా ఉండాలని ఇలా ప్లాన్ చేసాడో లేక రేపు విడుదలయ్యాక సమర్ధించుకోవడానికి కథ డిమాండ్ చేసింది అని కథలు చెబుతారా ఇప్పటికైతే వేచి చూడాలి.

ఒకపక్క మీ టూ ఉద్యమం అంటూ సినిమా హీరోయిన్లు బయటికి వచ్చి తమ ఉనికిని చాటుతూ మగాళ్ల లైంగిక వేధింపులపై సమరశంఖం పూరిస్తుంటే మరోపక్క ఇలాంటి కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తూ పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఫైనల్ కాపీ అయ్యాక సెన్సార్ బోర్డు ఉంది కానీ అంతకుముందు జరిగే పబ్లిసిటీ తతంగంలో వాళ్ళ ప్రమేయం ఏమి ఉండదు. ఫలితంగానే ఇలాంటి పైత్యాలు కళ్ళ ముందుకు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలు బాగుంటాయా లేదా అన్నది కాదు ముఖ్యం చిన్న పిల్లలు సైతం ఇంటర్ నెట్ యాక్సెస్ కు ఈజీగా అలవాటు పడి సినిమాల గురించి తెలుసుకుంటున్న తరుణంలో కంటెంట్ ని ఇలా పబ్లిసిటీ చేయటమే ఆలోచించాల్సిన విషయం.

బాలీవుడ్ లో ఇలాంటి వింత వికృతాలు గత కొన్నేళ్లలో తీవ్ర స్థాయిలో ఉన్నాయి కానీ ఇలా మరీ సౌత్ లో మొదలుకావడం మాత్రం ఆందోళన కలిగించే విషయమే. లేదు మా పాట మాదే మాకు వసూళ్లు రావడం ముఖ్యం అనుకునే నిర్మాతలను చూసి ఖర్మ అనుకోవడం తప్ప ఏమి చేయలేం.