మిస్టర్ ఏదో ఏదో ప్రమోషన్ బాగుందే

Tue Mar 21 2017 13:43:58 GMT+0530 (IST)

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్. లోఫర్ తర్వాత ఈ హీరో గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది. మరోవైపు వరుస ఫ్లాప్స్ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై టాలీవుడ్ లో ఆసక్తి ఎక్కువగానే ఉంది. వచ్చేనెలలో విడుదలకు సిద్ధమవుతున్న మిస్టర్ కోసం.. ఇప్పుడు ప్రమోషన్స్ ను అఫీషియల్ గా స్టార్ట్  చేసేశారు.

'ఏదో ఏదో బాగుందే' అంటూ సాగే పాటను రిలీజ్ చేసింది మిస్టర్ యూనిట్. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటలోని ప్రతీ లైన్ ఆకట్టుకోగా.. మిక్కీ జే మేయర్ అందించిన ట్యూన్ సూపర్బ్ గా ఉంది. మిక్కీ ఇచ్చిన క్యాచీ ట్యూన్.. ఈ మెలోడీని అద్భుతంగా తీర్చిదిద్దగా.. వీరికంటే ప్రముఖంగా సింగర్ రాహుల్ నంబియార్.. ఈ పాటకు ప్రాణం పోసేశాడని చెప్పాలి. వినగానే ఆకట్టుకుంటున్న ఏదో ఏదో సాంగ్.. ఇన్ స్టంట్ గా జనాలకు ఎక్కేసింది.

మంచి మెలోడీ సాంగ్ తో మిస్టర్ ప్రమోషన్స్ ను ప్రారంభించడం అందరినీ ఆకట్టుకుంటోంది. లావణ్య త్రిపాఠి.. హేభా పటేల్ లు మిస్టర్ లో వరుణ్ తేజ్ రొమాన్స్ చేయనుండగా.. ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.