Begin typing your search above and press return to search.

తారల దారులన్నీ ఆ పార్టీకే!!

By:  Tupaki Desk   |   20 Nov 2017 10:40 AM GMT
తారల దారులన్నీ ఆ పార్టీకే!!
X
ఎడ్ షీరన్.. ప్రపంచనానికి పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. సింగర్ గా.. రైటర్ గా.. గిటారిస్ట్ గా వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ఎడ్.. ప్రస్తుతం ఏషియా టూర్ లో ఉన్నాడు. ఈ టూర్ లో భాగంగా.. ఇవాళ సాయంత్రం ముంబైలో గ్రాండ్ ఈవెంట్ లో తన ట్యాలెంట్ చూపించనున్నాడు.

ఇప్పటికే ముంబై అంతా ఎడ్ షీరన్ ఫీవర్ అలముకుంది. ఎడ్ మ్యూజిక్ లో ఓలలాడేందుకు ఫ్యాన్స్ అంతా రెడీ అయిపోయారు. అయితే.. ఈ బ్రిటిష్ సింగర్ కోసం బాలీవుడ్ ఫిలిం మేకర్ ఫరా ఖాన్ గ్రాండ్ పార్టీ అరేంజ్ చేసింది. ముంబైలోని జుహులో ఉన్న తన ఇంటిలోనే ఈ పార్టీ ఇవ్వా.. ఈ పార్టీ అంతా ప్రముఖులతో కళకళలాడి పోయింది. ఎడ్ షీరన్ ను కలిసే అవకాశాన్ని బాలీవుడ్ స్టార్స్ నుంచి టీవీ స్టార్స్ వరకూ ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకునేందుకు ప్రయత్నించారు. షారూక్ ఖాన్.. కత్రినా కైఫ్.. కరణ్ జోహార్.. మలైకా అరోరా.. భూమీ పెడ్నేకర్.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్.. ఇలియానా డిసౌజా.. అభిషేక్ బచ్చన్.. సారా ఆలీ ఖాన్.. జాన్వి కపూర్.. ఇషాన్ ఖట్టర్.. ఇలా అనేక మంది వచ్చారు.

మరోవైపు టీవీ తారలు అయిన నకుల్ మెహతా.. మనీష్ పౌల్ కూడా ఎడ్ షీరన్ కు ఫరా ఖాన్ ఇచ్చి పార్టీలో సందడి చేశారు. అతనితో కలిసి దిగిన పోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తాము ఎంతగా ఆ పార్టీలో ఎంజాయ్ చేశారో చెప్పారు తారలు.