Begin typing your search above and press return to search.

టీజ‌ర్ టాక్ః క‌ల‌ర్ ఫుల్ ద్వారక‌

By:  Tupaki Desk   |   25 Aug 2016 4:24 AM GMT
టీజ‌ర్ టాక్ః క‌ల‌ర్ ఫుల్ ద్వారక‌
X
నెల కింద‌టి వ‌ర‌కు తెలుగులో ‘ద్వార‌క’ అనే సినిమా ఒక‌టి తెర‌కెక్కుతోంద‌న్న సంగ‌తే తెలియ‌దు. మ‌ధ్య‌లో ‘పెళ్లిచూపులు అనే సినిమా విడుద‌ల కాక‌పోయి ఉంటే.. ఈ రోజు ‘ద్వార‌క’ టీజ‌ర్ రిలీజైంద‌న్న చ‌ర్చ కూడా ఉండేది కాదు. కానీ ‘పెళ్లిచూపులు’ పుణ్య‌మా అని విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించే సినిమాల‌న్నింటికీ అదృష్టం క‌లిసొచ్చేస్తోంది. ఆటోమేటిగ్గా క్రేజ్ వ‌చ్చేస్తోంది.

ఇలాంటి టైంలోనే తెలివిగా ‘ద్వార‌క’ టీజ‌ర్ రిలీజ్ చేసి.. జ‌నాల్లో ఆస‌క్తి రేకెత్తించారు దాని ద‌ర్శ‌క నిర్మాత‌లు. అర నిమిషం నిడివి ఉన్న ద్వారక టీజ‌ర్ క‌ల‌ర్ ఫుల్ గా ఉంది. భ‌జ‌రే నంద‌గోపాల హ‌రే అంటూ.. ‘గోపాల గోపాల’ సినిమాలో భాజే సాంగ్ త‌ర‌హాలో ఓ పాట‌తో ర‌న్ చేశారు ఈ టీజ‌ర్. ఏదో పెళ్లి వేడుక మ‌ధ్య‌లో హీరో హీరోయిన్ల‌ను ప‌రిచ‌యం చేశారు. ‘పెళ్లిచూపులు’ సినిమాతో పోలిస్తే భిన్నంగా క‌నిపిస్తున్నాడు విజ‌య్ ఇందులో.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుండ‌టం విశేషం. లెజెండ్ సినిమా ప‌తాకంపై ప్ర‌ద్యుమ్న చంద్ర‌పాటి.. గ‌ణేష్ పెనుబోతు నిర్మిస్తున్నారు. శ్రీనివాస ర‌వీంద్ర (ఎంఎస్ ఆర్) ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.. సాయికార్తీక్ సంగీత ద‌ర్శ‌కుడు. రైట్ రైట్ ఫేమ్ పూజా జ‌వేరి.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అక్టోబ‌ర్లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశాలున్నాయి.