Begin typing your search above and press return to search.

ఇంతకీ దువ్వాడ ఎంత తెచ్చాడమ్మా?

By:  Tupaki Desk   |   24 Jun 2017 9:49 AM GMT
ఇంతకీ దువ్వాడ ఎంత తెచ్చాడమ్మా?
X
అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాధంకు ఓపెనింగ్ నుంచి టాక్ మిక్సెడ్ గా ఉన్న సంగతి తెలిసిందే. అల్టిమేట్ ఎంటర్టెయిన్మెంట్ అంటూ ఆన్ స్క్రీన్ పైకి వచ్చేసిన డీజే.. కామెడీని మెచ్చే ఆడియన్స్ ను మెప్పించినా.. సినిమా నిడివిపై చాలామంది అసంతృప్తి తెలిపారు.

అయితే.. ఈ మూవీ టాక్ సంగతేమో కానీ.. కలెక్షన్స్ మాత్రం అల్లు అర్జున్ స్ట్రెంగ్త్ ను చాటి చెప్పాయి. ముందు నుంచి ఉన్న అంచనాల కంటే ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచి కలెక్షన్స్ రావడం ట్రేడ్ పండితులను కూడా విస్మయానికి గురి చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే ఈ సినిమాకి భారీ వసూళ్లు వచ్చేశాయి. క్రేజ్ ఉండే మార్నింగ్ షోస్ మాత్రమే కాదు.. నైట్ షోస్ కి భారీ కలెక్షన్స్ వచ్చాయి. తొలి రోజున ఏపీ/నైజాం మార్కెట్ల నుంచి ఈ మూవీ 24 కోట్ల గ్రాస్.. 18 కోట్ల షేర్ వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.

అల్లు అర్జున్ కెరీర్ లోనే ఇది భారీ రికార్డ్ కాగా.. గత వసూళ్లను భారీ మార్జిన్ తో దాటడం విశేషం. ఇతర మార్కెట్లలో కూడా డీజే వసూళ్లు భారీగానే ఉన్నాయి. ప్రపంచవాప్తంగా తొలి రోజు డీజే గ్రాస్ 33 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బన్నీ మార్కెట్ ప్రకారం వీకెండ్ వరూ ఈ పేస్ నిలబడడం ఖాయమే. ఆ తర్వాత పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందనే అంశంపైనే డీజే రిజల్ట్ ఆధారపడి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/