Begin typing your search above and press return to search.

దసరా సినిమాలన్నీ ఇంకా డేంజర్‌ జోన్‌ లోనే..!

By:  Tupaki Desk   |   22 Oct 2018 10:36 AM GMT
దసరా సినిమాలన్నీ ఇంకా డేంజర్‌ జోన్‌ లోనే..!
X
ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న దసరా వచ్చి వెళ్లి పోయింది. ఇక దసరా సీజన్‌ లో వచ్చిన ‘అరవింద సమేత’ - ‘హలో గురు ప్రేమకోసమే’ - ‘పందెం కోడి 2’ చిత్రాలు మాత్రం ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అరవింద సమేత చిత్రానికి హిట్‌ దక్కింది. అయితే ఈమూడు సినిమాలు కూడా ఇంకా బ్రేక్‌ ఈవెన్‌ కు చేరువ కాలేదు. దసరా సెలవులు నిన్నటితో ముగిశాయి. నేటి నుండి ఈమూడు సినిమాలు అసలు సత్తా బయటకు రాబోతుంది.

అరవింద సమేత చిత్రం ఇప్పటి వరకు 85 కోట్ల షేర్‌ ను రాబట్టగలిగింది. ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ కు చేరాలంటే ఇంకా ఎనిమిది కోట్ల షేర్‌ ను రాబట్టాల్సి ఉంది. ఈ మొత్తం రాబట్టడం పెద్ద కష్టం ఏమీ కాదని ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఇక హలో గురు ప్రేమకోసమే చిత్రం 10 కోట్లకు పైగా షేర్‌ ను రాబట్టింది. అయితే ఈ చిత్రం భారీ మొత్తానికి అమ్ముడు పోయిన కారణంగా బ్రేక్‌ ఈవెన్‌ అసాధ్యం అనే టాక్‌ ట్రేడ్‌ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక పందెం కోడి 2 చిత్రం కూడా విశాల్‌ స్థాయికి మంచి వసూళ్లను రాబట్టింది. లాంగ్‌ రన్‌ లో ఈ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ కు చేరువ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

దసరా సీజన్‌ ను పూర్తిగా వినియోగించుకోవడంలో ఈ మూడు సినిమాలు కూడా సఫలం అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అరవింద సమేత భారీ వసూళ్లను రాబడుతోంది. అయితో ఓవర్సీస్‌ లో మాత్రం ఈ చిత్రం కాస్త నిరాశ పర్చుతోంది. అక్కడ దాదాపు హాఫ్‌ మిలియన్‌ డాలర్లు వస్తే తప్ప బ్రేక్‌ ఈవెన్‌ రాదు. కాని పరిస్థితి చూస్తుంటే అది అసాధ్యం అన్నట్లుగా అనిపిస్తుంది. నిన్నటి ఆదివారం కలెక్షన్స్‌ రిపోర్ట్‌ వచ్చేప్పటికి మూడు సినిమాలు కూడా డేంజర్‌ జోన్‌ లోనే ఉన్నాయంటూ ట్రేడ్‌ వర్గాల వారు చెబుతున్నారు.