Begin typing your search above and press return to search.

రుద్రమకి అంతా కలిసొచ్చే కాలమే..

By:  Tupaki Desk   |   12 Oct 2015 7:43 AM GMT
రుద్రమకి అంతా కలిసొచ్చే కాలమే..
X
టాక్ - విమర్శలు - చరిత్రకారుల వ్యంగ్యాలు.. ఎన్ని ఎలా ఉన్నా రుద్రమదేవి జైత్రయాత్ర మాత్రం సూబర్బ్ గా ఉంది. కేవలం తొలి వీకెండ్ లో 19.5 కోట్లు షేర్‌ కేవలం తెలుగు రాష్ట్రంలలో కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. అయితే పోటీ అనేదే లేకపోవడంతో.. మొదటి మూడ్రోజులు వచ్చాయి కానీ.. తర్వాత ఈ జోరు ఉంటుందా అనే ప్రశ్న చాలామందికే ఉంది. కానీ ఇదేమంత పెద్ద విషయం కాదు. ఎందుకంటే.. ఆల్రెడీ రెండు తెలుగురాష్ట్రాలు, కర్నాటకల్లో ఇవాల్టి నుంచి దసరా పండుగ.

ఆదివారం నుంచే పిల్లలకు సెలవలు మొదలైపోయాయి. కొన్ని విభాగాల ఉద్యోగులకు కూడా 15 రోజుల హాలిడేస్ ఉన్నాయి. విమర్శలు - రేటింగులతో సంబంధం లేకుండా.. థియేటర్లకు తరలొస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. చరిత్రను చెప్పడం కాకుండా.. చూపించే ఛాన్స్ రావడంతో.. ఆ అవకాశాన్ని పేరెంట్స్ వదులుకోవడం లేదు. అందుకే మొత్తం అన్ని చోట్లా హౌస్ ఫుల్సే. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయంటే. రుద్రమ జోరు అర్ధమవుతుంది. ముఖ్యంగా రుద్రమదేవిలో గోనగన్నారెడ్డిగా స్టైలిష్ స్టార్ చూపించిన జోరుకి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. రుద్రమ కేరక్టర్ కి ధీటుగా ఇంపార్టెన్స్ ఉండడం, మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడంతో.. మెగా ఫ్యాన్స్ రుద్రమను బాగానే అక్కున చేర్చున్నారు.

ఈ శుక్రవారం బ్రూస్ లీ వస్తుందని ముందే తెలిసినా.. తన ప్రాజెక్ట్ పై నమ్మకంతో గుణశేఖర్ ధైర్యం చేసి వారం ముందే డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడా నమ్మకం నిజమవుతోంది. మొదటి వారంలోనే పెట్టుబడిని రాబట్టుకునే సత్తా కనబరుస్తోంది రుద్రమ దేవి. అయితే అందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రాయితీ కూడా బాగానే ప్లస్సవుతోంది. మామూలుగా అయితే కోటి రూపాయలు గ్రాస్‌ వస్తే.. దాదాపు అందులో 40% ట్యాక్సులకు ఎగిరిపోయేది. కాని ఇప్పుడు మాత్రం అక్కడ సర్వీస్‌ ట్యాక్స్‌ తప్పించి ఎంటర్‌ టైన్ మెంట్ ట్యాక్సు లేకపోవడంతో పెద్ద ప్లస్సే అయ్యింది. ఎపి కూడా ఇలాంటి రాయితీ ఇచ్చుంటే.. తొలి వారంలోనే మనోడు 60 కోట్లు రాబట్టేస్తాడేమో!!