చరణ్ మరో మల్టీస్టారర్?

Thu May 17 2018 12:16:50 GMT+0530 (IST)

ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ కథలకు మన హీరోలు కొత్త అర్థం చెబుతున్నారు. అభిమానులకు కొత్త తరహా అభిరుచిని పరిచయం చేయాలని ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో ఒక సినిమాను ఒకే చేసిన సంగతి తెలిసిందే. అలాగే మరో ఇండస్ట్రీలోని హీరోతో కూడా  చరణ్ కలిసి నటించబోతున్నాడట.అతను ఎవరో కాదు. రీసెంట్ గా మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. అయితే త్వరలోనే అతను టాలీవుడ్ లో మరిన్ని కథలకు ఒకే చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మన దర్శకులు చాలా వరకు దుల్కర్ యాక్టింగ్ ను బలే ఇష్టపడుతున్నారు. అతనికి అవకాశాలు పెరగవచ్చని టాక్. ఇక త్వరలోనే కే ఎస్ రవిచంద్రన్ చేయబోయే సినిమాలో రామ్ చరణ్ - దుల్కర్ కలిసి నటించబోతున్నారట.

ఈ స్టార్ హీరోల తనయులు ఒకే తెరపై కనిపిస్తే ఇద్దరి క్రేజ్ మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్ చరణ్ కి మలయాళంలో కూడా మార్కెట్ పెరుగుతుంది. ఇప్పటికే రంగస్థలం సినిమాతో పక్క ఇండస్ట్రీలో లో కూడా క్రేజ్ అందుకున్నాడు. ఆ సినిమా రీసెంట్ వరల్డ్ వైడ్ గా 200 కోట్లను క్రాస్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రవిచంద్రన్ ప్రాజెక్ట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం చరణ్ బోయపాటి ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు.