నార్త్ కి వెళ్తున్నా యంగ్ హీరో

Sat Aug 12 2017 12:05:02 GMT+0530 (IST)

బాలీవుడ్ సినిమాలలో సౌత్ స్టార్లు కనిపించడం కొంచం తక్కువనే. సౌత్ స్టార్లు కొంతమంది హీరోగా చేసిన ఆశించిన విజయాలు అయితే రాలేదు. ఇప్పుడు మరో యంగ్ సౌత్ హీరో బాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మలయాళం సూపర్ స్టార్ మమ్మూట్టి కొడుకుగా ఇండస్ట్రి కి పరిచయమై ఇప్పుడు తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని సంపాదించుకున్న హీరో  దుల్కర్ సల్మాన్.

తమిళ్ ప్రేక్షకులు ఈ హీరో ముందుగానే తెలిసిన మన తెలుగు ప్రేక్షకులు మాత్రం మణిరత్నం డైరెక్ట్ చేసిన ‘ఓకే బంగారం’ సినిమాతో పరిచయమయ్యాడు. ఈ సినిమాలో తన నటనతో సౌత్ మొత్తం అభిమానులను దక్కించుకున్నాడు. అదే స్పీడ్ లో ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. మహానటి సావిత్రి జీవితం ఆదారంగా తీస్తున్న సినిమాలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా తమిళ్ - తెలుగు - మలయాళం భాషలలొ విడుదలకాబోతుంది. సౌత్ లో నెమ్మదిగా అందరికీ నచ్చిన నటుడుగా మారిన దుల్కర్ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి బాలీవుడ్ సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ప్రముఖ ఫిల్మ్ ప్రొడ్యూసర్ రోన్నీ స్క్రూవాలా నిర్మించబోతున్న హింది సినిమాలో దుల్కర్ హీరోగా చేయబోతున్నాడు. ఈ సినిమా ఎక్కువ భాగం కేరళలో షూటింగ్ జరుగుతుంది అని చెబుతున్నారు. రోడ్ ట్రిప్ నేపధ్యంలో సాగే ఈ కథలో ఇర్ర్ఫాన్ ఖాన్ మరియు మిథిల పాల్కర్ ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను రైటర్ ఆకర్ష్ ఖురానా డైరెక్ట్ చేయబోతున్నారు అని చెబుతున్నారు.

 ఇప్పుడు అయితే దుల్కర్ సల్మాన్ తన నటించిన ‘సోలో’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. బిజోయ్ నంబియార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దుల్కర్ ఆర్మీ మాన్ గా కనిపించనున్నాడు. తమిళ్ మలయాళంలో ఒకేసారి  విడుదలకాబోతున్న ఈ సినిమాలో నేహా శర్మా హీరోయిన్ గా నటిస్తుంది. ‘కమ్మటిపాడమ్’ ‘కాలి’ లాంటి విభిన్న కథలులో నటించి ప్రేక్షకులు అభిమానం పొందిన ఈ యంగ్ హీరో ఈ ఏడాది చివరిలో వచ్చే బాలీవుడ్ సినిమాతో నేషనల్ హీరోగా మారబోతున్నాడు.