Begin typing your search above and press return to search.

ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ చేస్తున్న దిల్ రాజు

By:  Tupaki Desk   |   5 Dec 2018 5:27 AM GMT
ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ చేస్తున్న దిల్ రాజు
X
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ నుండి వస్తున్న సినిమాలు ఈమధ్య ఫ్లాప్ అవుతున్నాయి. అలా అని అయన నిరాశపడకుండా ఇంట్రెస్టింగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ కానున్న వెంకటేష్-వరుణ్ తేజ్ మల్టిస్టారర్.. సమ్మర్లో విడుదల అయ్యే మహేష్ బాబు 'మహర్షి'.. ఈ రెండూ క్రేజీ ప్రాజెక్టులే. ఈ రెండు కాకుండా మరో ఇంట్రెస్టింగ్ కాంబో సెట్ చేసే ప్రయత్నాల్లో దిల్ రాజు ఉన్నాడట.

న్యాచురల్ స్టార్ నాని తో దిల్ రాజు కు మూడు సినిమాల డీల్ ఉందట. ఇప్పటికే 'నేను లోకల్'.. 'ఎంసీఎ' వారిద్దరి కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో హ్యాట్రిక్ సినిమాకు నాని రెడీ అవుతున్నాడు. మొదట తమిళ సూపర్ హిట్ '96' ను నాని హీరోగా రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తే అది వర్క్ అవుట్ కాలేదట. దీంతో మరో మంచి సబ్జెక్టు కోసం వేచి చూస్తూ ఉంటే ఇంద్రగంటి మోహనకృష్ణ ఒక మల్టి స్టారర్ కథను రాజుగారివద్దకు తీసుకొచ్చాడట. ఇంద్రగంటి స్టొరీ రాజుగారికి నచ్చడంతో నాని - మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ లతో ఈ సినిమాను నిర్మించాలనే ప్రయత్నాలు చేస్తున్నాడట.

దుల్కర్ కు సౌత్ లో మంచి క్రేజ్ ఉండడంతో ఈ సినిమాను ఇతర భాషలలో కూడా రిలీజ్ చేసే అవకశం ఉందని భావిస్తున్నాడట. ప్రస్తుతం అయితే ఇద్దరు హీరోలు బిజీగా ఉన్నారుగానీ ఇద్దరి డేట్స్ దొరికిన వెంటనే ఈ క్రేజీ మల్టిస్టారర్ పట్టాలెక్కిస్తాడట.