Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: డైవర్ రాముడు.. సరిపోలేదు

By:  Tupaki Desk   |   22 May 2018 4:25 PM GMT
ట్రైలర్ టాక్: డైవర్ రాముడు.. సరిపోలేదు
X
కమెడియన్ సక్సెస్ అందుకోగానే యువ నటులు కథానాయకులుగా మారడానికి ఈ రోజుల్లో ఎక్కువగా సమయం పట్టడం లేదు. కథను ముందుండి నడిపించే అవకాశం వచ్చింది అంటే ఏ నటుడైనా సరే వదులుకోడు. చాలా వరకు ఈ మధ్య ఫెయిల్యూర్ అవుతున్నా కూడా ప్రయత్నాలు మాత్రం తగ్గడం లేదు. జబర్దస్త్ ద్వారా మంచి కమెడియన్ గా ఎదిగిన షకలక శంకర్ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇకపోతే శంకర్ కథానాయకుడిగా చేసిన తన మొదటి సినిమా డ్రైవర్ రాముడు టీజర్ ను రిలీజ్ చేశాడు. ట్రైలర్ లో సినిమా ప్రజెంటేషన్ చాలా కాస్ట్లీగా ఉందని అనిపిస్తోంది. చూస్తుంటే ఖర్చు బాగానే పెట్టినట్లు కూడా అనిపిస్తోంది. ఈ కమెడియన్ పై ఏ స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారో గాని సినిమా టీజర్ అయితే పరవాలేదు అనే విధంగా ఉంది. అంతా కొత్తగా ఏమి లేదు. కేవలం టైటిల్ ఎనౌన్స్ మెంట్ కోసం టీజర్ వదిలినట్లు ఉంది.

హీరోయిన్ ఇంట్రడక్షన్ పై ఒక సిన్ అలాగే శంకర్ డైలాగ్స్ డెలివరీ మామూలుగానే ఉన్నాయి. ఇక సినిమాపై అంచనాలు పెరగాలంటే ఈ మాత్రం టీజర్ సరిపోదు. ట్రైలర్ విషయంలో అయినా చిత్ర యూనిట్ మరింత జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది. ఇంతకుముందు హీరోగా చేసిన కమెడియన్స్ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. మరి శంకర్ అయినా తన ప్రతాపాన్ని చూపిస్తాడో లేదో చూడాలి.