అంతా సిద్ధం.. ఆ ఒక్కటి తప్ప

Thu May 17 2018 13:31:22 GMT+0530 (IST)

టాలీవుడ్ లోనూ బయోపిక్ లు బ్రహ్మాండమైన సక్సెస్ సాధించగలనవని మహానటి ప్రూవ్ చేసింది. దీని తరవాత విఖ్యాత నటుడు ఎన్టీఆర్ బయోపిక్ పై అంతటా ఆసక్తి నెలకొంది. తెలుగు వారంతా ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్ జీవిత గాథతో ఆయన తనయుడు - హీరో బాలకృష్ణ సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. అనౌన్స్ మెంట్ నుంచే ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం యూనిట్ సిద్ధమవుతోంది.ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి తాజాగా ఓ లీక్ బయటకు వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ అల్లుడు.. ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను హీరో రానా చేయనున్నాడనే న్యూస్ తో ఈ సినిమాపై ఇంకాస్త ఇంట్రస్ట్ క్రియేటయింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలీ సినిమా డైరెక్టర్ ఎవరనే దానిపై అటు నిర్మాతలు గానీ.. ఇటు హీరో బాలకృష్ణ గానీ.. యూనిట్ సభ్యులు గానీ పెదవి విప్పడం లేదు. ఈసినిమా షూటింగ్ తేజ డైరెక్షన్ బాధ్యతలు తీసుకున్నాడు. రెగ్యులర్ షూటింగ్ కు ముందే ఆ బాధ్యత నుంచి తప్పుకున్నాడు. తరవాత ఈ సినిమా బాలయ్యే డైరెక్ట్ చేస్తాడని... చంద్రసిద్ధార్ధ్ పర్యవేక్షణ బాధ్యతలు తీసుకుంటాడనే న్యూస్ వచ్చినా ఇంతవరకు అదేదీ కన్ఫర్మ్ కాలేదు.

డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్.. సినిమా దారితెన్నూ నిర్దేశించే దర్శకుడు ఎవరనేది లేకుండా సినిమాలో ఉండే హంగులు.. భారీ కాస్టింగ్ గురించి చెప్పుకొచ్చినా ఫలితం ఉండదు. బయోపిక్ అంటే అందరికీ తెలిసిన కథ. దానిని అందంగా చెప్పడం అనేది పూర్తిగా దర్శకుడి టాలెంట్ పై ఆధారపడి ఉంటుంది. అంత కీలకమైన డైరెక్టర్ రంగంలోకి రాకుండా ఎంత హడావుడి చేసినా అంత ప్రయోజనం ఏమీ ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ థియేటర్లలో ఉంటుందంటున్నారు ప్రొడ్యూసర్ విష్ణు ఇందూరి. రిలీజ్ డేట్ సంగతి తరవాత చెప్పొచ్చు.. డైరెక్టర్ విషయం తేల్చండి సారూ..