జై లవకుశ డ్రామా సీన్లు ఎలా వచ్చాయంటే

Sun Sep 24 2017 15:16:53 GMT+0530 (IST)

సాధారణంగా దర్శకుడు కథను రాసుకున్నప్పుడు ఎక్కువగా మార్పులు ఏమి చెయ్యడు. ఎందుకంటే కొన్ని కథలు ప్రతి సీన్ టూ సీన్ ఎక్కడో అక్కడ టచ్ అవుతూనే ఉంటాయి. చాలావరకు స్క్రిప్ట్ మొత్తం ఒకే లెవెల్ లో ఉండేలా చూసుకుంటారు. కొందరు దర్శకులు అవసరం అయితే మరికొన్ని సీన్స్ యాడ్ చేస్తారు. అయితే ఇదే తరహాలో జై లవకుశ సినిమాలో కూడా జరిగిందట.ప్రస్తుతం సినిమా మొత్తంలో జై పాత్ర ఎంత ఆకట్టుకుంటోందో.. అంతే స్థాయిలో సినిమాలోని మూడు పాత్రలు చేసిన డ్రామా ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటోంది. సినిమా చూసినవారు డ్రామా ఎపిసోడ్ చాలా బావుందని కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఎపిసోడ్ లో త్రిపాత్రాభినయంలో ఎన్టీఆర్ అన్ని పాత్రలను సమానంగా చేసి అలరించాడు.అయితే మొదట స్క్రిప్ట్ లో ఆ సన్నివేశాలు దర్శకుడు కె.ఎస్ రవీంద్ర రాసుకోలేదట. కథ ఎన్టీఆర్ కి చెప్పిన తర్వాత మొత్తంగా ఒకసారి చర్చించుకున్నారట. అప్పుడు హరికృష్ణ - కళ్యాణ్ రామ్ కూడా ఉన్నారు.

కాన్సెప్ట్ విన్న తరువాత సినిమాలో డ్రామా లాంటి ఒక మంచి ఎపిసోడ్ పెడితే బావుంటుందని అందరూ నిర్ణయించుకొని దర్శకుడికి చెప్పడంతో ఆ ఆలోచనతో దర్శకుడు రాసుకొని తనదైన శైలిలో ఆ ఎపిసోడ్ ని తెరకెక్కించాడు. దీంతో విడుదల తర్వాత సినిమాకి ఆ డ్రామా ఎపిసోడ్ బాగా ప్లస్ అయ్యింది. ఆ సీన్లలో అన్నదమ్ముల మధ్య ప్రేమను చూపించిన విధానం చాలా ఆకట్టుకుంది.